జల కళ : లక్నవరంలో పర్యాటకుల సందడి

Laknavaram-Lakeరెండు రోజులుగా కురుసిన వర్షాలతో జ‌య‌శంక‌ర్ జిల్లాలోని లక్నవరం పూర్తిగా నిండింది. లక్నవరం జ‌ల‌క‌ళ‌ను సంత‌రించుకోవడంతో సందర్శకుల పోటెత్తింది. ఈ సరస్సులో బోట్ షికారు చేస్తూ సందడి చేస్తున్నారు సందర్శకులు. జలకళతో నిండుకుండ‌గా మారిన ల‌క్న‌వ‌రం చెరువును సంద‌ర్శించేందుకు వరంగల్, ఖమ్మం,  కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలతో పాటు హైదరాబాద్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన పడవలో  సరస్సు చుట్టూ షికారు చేస్తూ.. ఉల్లాసంగా గడుపుతున్నారు సందర్శకులు. చుట్టూ గుట్టలు మధ్యలో గోదావరిలా పరవళ్లు తొక్కే నీటిని చూసి సంతోషంతో కేరంతలు కొడుతున్నారు పర్యాటకులు. కనుచూపు మేర వరకూ కనిపించే నీటి ప్రవాహం.. సందర్శకులను బాగా ఆకట్టుకుంటోంది. చిన్న పడవల్లో సైతం వెళ్లి సరస్సు అందాలను తనివితీరా వీక్షిస్తున్నారు పర్యాటకులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy