జవాన్లూ.. జర జాగ్రత్త

armyఆర్మీ జవాన్లు సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు అధికారులు. ఫేస్ బుక్, ఇతర వెబ్ సైట్ లలో పోర్న్ వీడియోలు, ఫొటోలు  చూడొద్దని ఆదేశాలు జారీచేశారు.  రంజిత్ సింగ్ అనే వ్యక్తిని ఐఎస్ఐ ఏజెంట్ గా అనుమానిస్తున్న ఓ యువతి హనీట్రాప్ చేసి.. భద్రతా సమాచారాన్ని రాబట్టడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆన్ లైన్ లో జవాన్లు చేయకూడని పది పనులను తెలుపుతూ ఆర్మీ అధికారులు ఓ లిస్టును విడుదల చేశారు.

  •  ఫేస్ బుక్ ,ఇతర సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పోర్న్ ఫొటోలు చూడరాదు
  •  యూనిఫామ్  వేసుకున్న ఫొటోను వాట్సప్, ఫేస్ బుక్ వంటి వాటిల్లో ప్రొఫైల్ ఫొటోగా పెట్టరాదు
  • లాటరీలు, ప్రైజులు తగిలాయంటూ వచ్చిన మెసేజ్ లను ఓపెన్ చేయరాదు
  •  వ్యక్తిగత సమాచారం, హోదా లాంటి విషయాలను సోషల్ మీడియాలో ఉంచొద్దు
  • పరిచయం లేని వ్యక్తుల నుంచి వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్టులను అనుమతించొద్దు
  •  జవాన్ల కుటుంబ సభ్యులు సైతం వృత్తిని తెలిపే వివరాలను పోస్ట్ చేయరాదు
  • వ్యక్తిగత ల్యాప్ టాప్ లు, కంప్యూటర్లలో మిలటరీకి సంబంధించిన సమాచారం ఉంచొద్దు

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy