జస్ట్ మిస్ : ఎదురెదురుగా వచ్చిన విమానాలు

1366573_Wallpaper2బైక్ ఆక్సిడెంట్ జస్ట్ మిస్ అయ్యిందంటేనే గుండెలు జల్లుమంటాయి. అలాంటిది  విమాన ప్రమాదం నుంచి బయటపడితే ఎలా ఉంటుందో ఊహించుకోవడమే కష్టం.  శుక్రవారం ఉదయం (ఏప్రిల్ 7) ఢిల్లీలోని విమానాశ్రమంలో ఎయిర్ ఇండియా – ఇండిగో విమానం ఎదురెదురుగా వచ్చాయి. ఢీ కొట్టబోయింది. జస్ట్ మిస్ అయ్యాయి. లేకపోతే పెద్ద విధ్వంసమే జరిగేది. ఢిల్లీ – గోవా ఎయిర్ ఇండియా విమానం 11:15 నిమిషాలకు రన్ వే పైకి వచ్చింది.ఆ సమయానికి అక్కడ ఇండిగో విమానం పార్కింగ్ చేసి ఉండటంతో ఎయిర్ ఇండియా విమానాన్ని దారి మళ్లించినట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తెలిపారు. ఈ ప్రమాదం తప్పించటం కోసం ఇద్దరు పైలెట్ లు స్టాండెడ్ ఆపరేటింగ్ పధ్దతిని ఉపయోగించారని అధికారులు తెలిపారు. రాంచీ – ఢిల్లీ మధ్య తిరిగే ఇండిగో విమానం 27 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. ఈ సంఘటన జరిగే కొద్దిసేపటి ముందే.. ప్రధానమంత్రి మోడీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాని ఆహ్వానించడానికి విమానాశ్రమానికి వచ్చారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy