జస్ట్ లో మిస్: గుండెలు అదిరాయి

busఅదృష్టమంటే వారిదే. లేదంటే 12 మంది జల సమాధి అయ్యేవారు. అంతెత్తు నుంచి సముద్రంలో పడి.. ప్రాణాలు పోగొట్టుకునేవారు. రామేశ్వరం వంతెనపై జరిగిన ఈ ప్రమాదం.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అచ్చం సినిమాలోలా.. 12 మంది ప్రాణాలు కాపాడాడు డ్రైవర్. అతనే కనుక సమయస్ఫూర్తితో వ్యవహరించకపోతే.. పై ప్రాణాలు పైనే పోయేవి. వివరాల్లోకి వెళితే.. విరుదునగర్‌ జిల్లా కల్లూరణికి చెందిన 12 మంది.. ఓ వ్యానులో రామేశ్వరం బయలుదేరారు. అళగేశ్వరన్‌ అనే వ్యక్తి వ్యాన్ నడుపుతున్నాడు. ఆదివారం తెల్లవారుజామున వ్యాను సముద్రంపై నిర్మించిన పాంబన్‌ వంతెనపైకి చేరుకుంది. అదుపుతప్పిన వ్యాను వంతెనపై ఎడమవైపునున్న కరెంట్ స్తంభాన్ని ఢీకొంది. వెంటనే అలర్టైన డ్రైవరు వ్యానును కుడివైపునకు మళ్లించాడు. చకచకా బ్రేకులు వేశాడు. గోడను ఢీకొని ఆగిపోయింది. అప్పటికే ముందు చక్రాలు వంతెన నుంచి బయటకు వెళ్లాయి. పర్యాటకులు ఒక్కసారిగా భయాందోళనలతో పెద్దగా కేకలు వేశారు. తర్వాత తేరుకుని బయటపడేందుకు ప్రయత్నించారు. వ్యాను తలుపులు కొంతమేరకు వంతెన బయటకు ఉండటంతో ఒక్కొక్కరిగా బిక్కుబిక్కుమంటూ దిగారు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే హైవే పెట్రోల్‌ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రమాదం గురించి పాంబన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవరు ఏమాత్రం సమయస్ఫూర్తితో వ్యవహరించకున్నా వ్యాను సముద్రంలోకి దూసుకెళ్లి ఉండేదని… బాధిత పర్యాటకులు తెలిపారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy