కాంగ్రెస్ కౌంటర్ : మా నోరు మూసేందుకే సస్పెన్షన్

Janareddy-Assembly-Pointతెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సభ్యున్ని సభలో దారుణంగా సస్పెన్స్ చేయడం తీవ్రమైన  చర్య అన్నారు కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత జానారెడ్డి. ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయటం దారుణం అన్నారు. స్పీకర్ మా వాదన వినకుండా నిర్ణయం తీసుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అల్లర్లలో ఎలాంటి పాత్ర లేకపోయినా.. తనను సస్పెన్షన్ వేయడం అవమానకరమన్నారు. అసెంబ్లీలో తాము ఎత్తిచూపే లోపాలు ఉంటాయనే ఉద్దేశ్యంతోనే మానోరు మూసేందుకే ఈ కుట్ర జరిగిందన్నారు.

ఎన్నికల సమయంలో ఈ బడ్జెట్ సెషన్ ఎంతో కీలకమని, ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతల్ని బయటికి పంపించి, టీఆర్ఎస్ నేతలు తూతూ మంత్రంగా బడ్జెన్ ను ప్రవేశపెట్టేందుకే ఈ కుట్ర అన్నారు. ప్రజలు ఈ అప్రజస్వామ్యాన్ని గమనించాలన్నారు జానా. మండలిలోనూ ఇదే తరహాలో సస్పెండ్ చేశారన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్యవహరించిందన్నారు.

సభలో ఎవరిపైనా దాడి చేయలేదన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిన్నటి ఘటన ఓ డ్రామాగా అభివర్ణించారు. ఎవరిపైనా దాడి చేయలేదని వివరణ ఇచ్చారు. నాలుగేళ్లుగా పార్టీ మారిన వారిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. నిన్నటి సభలో జరిగిన విషయంపై మాత్రం వెంటనే నిర్ణయం తీసుకున్నారంటూ విమర్శించారు ఉత్తమ్. సభలో మా వాదన ఎందుకు వినటం లేదని ప్రశ్నించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy