జార్ఖండ్ లో ఘోరం : యువతిని రేప్ చేసి తగలపెట్టారు

chamజార్ఖండ్ రాష్ఠ్రం ఛాత్రా జిల్లాలో ఓ యువతిని గ్యాంగ్ రేప్ చేసి.. ఆ తర్వాత యువతిపై పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఈ కేసుపై సీరియస్ అయిన ప్రభుత్వం విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని నియమించింది. రంగంలోకి దిగిన పోలీసులు.. కేసులో 14 మందిని శనివారం(మే-5) పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు భాధిత కుటుంబానికి 2.5 లక్షల ఆర్ధికసాయం అందించింది జిల్లా యంత్రాంగం.

గురువారం ఉదయం ఓ యువకుడు తన స్నేహితులతో కలసి యువతిని కిడ్నాప్ చేశాడు. అనంతరం అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పింది. ఆ వెంటనే వారు పంచాయితీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. పంచాయితీ పెట్టిన పెద్దలు.. నిందితులకు రూ.50 వేల జరిమానా, 100 గుంజిళ్లు తీయాలంటూ పంచాయితీ తీర్పు చెప్పింది.

పంచాయితీ తీర్పుపై కోపంతో రగిలిపోయిన నిందితులు రాత్రి సమయంలో ఆ యువతి ఇంటికి వెళ్లి యువతి తల్లిదండ్రులపై దాడి చేశారు. తమ వెంట తెచ్చుకున్న యువతిని పెట్రోల్ పోసి తగులబెట్టారు. కళ్లెదుటే కూతురిపై పెట్రోల్ పోసి తగలబెట్టటంతో షాక్ అయ్యారు. గుంపుగా వచ్చిన కిరాతకులు.. ఈ ఘాతుకానికి ఒడిగడ్డారు. యువతి చనిపోవటంతో.. అత్యాచారం విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకూ ఈ కేసుతో సంబంధం ఉన్న 14 మందిని అరెస్ట్ చేశామని ఇన్ స్పెక్టర్ జనరల్ ఆశిష్ బత్రా తెలిపారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy