జాలి వద్దు… రెస్పెక్ట్ ఇస్తే చాలు

BLINDరంగుల ప్రపంచం కనిపించదు. మాయా ప్రపంచాన్ని చూళ్లేరు. కానీ.. ఈ ప్రపంచంలో తామూ ఒకటంటున్నారు. ఫిజికల్లీ చాలెంజ్ డ్ అయినా.. లైఫ్ ని చాలెంజ్ గా తీసుకుని సత్తా చూపిస్తున్నారు. రెండు కళ్లుంటేనే.. చాలా మంది సరిగా వెళ్లలేరు. కానీ వీళ్లలా కాదు. కార్లు తోలగలరు. రోడ్లపై నడవగలరు. ఆఫీస్ కెళ్లి నేరుగా ఇంటికెళ్లగలరు. మ్యూజిక్ వాయించగలరు. మేజిక్ చేయగలరు. చెస్ బోర్డుపై తామెంత జీనియసో చూపించగలరు. సంకల్పం అనే పెద్దమాట ఇలాంటి వాళ్లకి వాడ్డంలో అతిశయోక్తి లేదు. నిజమే. సంకల్పమే వీళ్లందరినీ నడిపిస్తోంది. కమిట్ మెంట్ పై కమిటై ఉండి… కావాల్సిన రూట్ లో కరెక్ట్ గా వెళ్తున్నారు. కళ్లు లేని వాళ్లంటే కర్రలు పట్టుకుని నడుస్తారని తెలిసిందే. కానీ.. వీళ్లు కంప్యూటర్లపై వర్క్ చేయడంలో మేథావులు. స్మార్ట్ ఫోన్లని స్మార్ట్ గా వాడగలరు. బ్యాండ్ పట్టుకుంటే మ్యూజిక్ వాయించగలరు. ఆఫీస్ కెళ్తే ఉద్యోగం చేస్తారు. ఇంటికెళ్తే ఫ్యామిలీ బాగోగులు చూసుకుంటారు.

ఇతనికి రెండు కళ్లూ లేవు. అయినా ఈన ప్రయాణం ఆగదు. ఎక్కడికైనా వెళ్లగలడు. చేతిలో కర్రుంటే చాలు. ఇతని పేరు శివప్రసాద్. రోజూ సిటీ బస్ లో ఆఫీస్ కెళ్లి వస్తుంటాడు. ఎవరి సాయం లేకుండానే.. బస్టాండ్ వరకూ వస్తాడు. బస్సెక్కి ఇంటికొస్తాడు. ఏ సమస్యా లేకుండా తన ఫ్యామిలీని చూసుకుంటున్నాడు.ఇతను రవి గణేశ్. రెండు కళ్లూ లేపోయినా.. టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నాడు. మ్యూజిక్ మాస్టరితను. ఓ ప్రైవేట్ స్కూల్ లో మ్యూజిక్ క్లాసులు చెబుతున్నాడు. ల్యాప్ టాప్ ఆన్ చేస్తే.. ఫ్రెండ్స్ తో చాటింగ్ చేస్తాడు. ఆన్ లైన్ లోనే మ్యూజిక్ నేర్పిస్తాడు. పాటలు పాడుతూ అందరినీ ఎంటర్ టైన్ చేస్తాడు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy