జాల్‌ రేవెన్‌ పోలార్‌ పోటీల్లో తెలుగు యువకుడు

jaya rajమైనస్‌ 30 డిగ్రీల ఉష్ణోగ్రత.. 300 కిలోమీటర్ల దూరం .. ఏడు రోజుల యాత్ర. సైబీరియన్‌, అలస్కా జాతులకు చెందిన హస్కీ కుక్కలు లాగే స్లెడ్జెస్‌ వాహనంలో ప్రయాణం.. ప్రపంచంలోనే అత్యంత సాహస యాత్ర జాల్‌ రేవెన్‌ పోలార్‌. ఈ సాహస క్రీడకు విశాఖకు చెందిన డెంటల్‌ విద్యార్థి జయరాజ్‌ గేదెల దరఖాస్తు చేసుకున్నాడు. భారత్‌ ఉన్న రీజియన్‌లో టాప్‌-4లో నిలిచి తుది ఎంపికకు కొద్దిదూరంలో నిలిచాడు. ఈ క్రమంలో తనకు తెలుగు రాష్ట్రాల ప్రజలు మద్దతుగా నిలిచి ఓటు వేయాలని కోరుతున్నాడు జయరాజ్‌.

స్వీడన్‌లో ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా జాల్‌ రేవెన్‌ పోలార్‌ పోటీలను నిర్వహిస్తారు. పోటీ సందర్భంగా చనిపోతే.. నిర్వాహకులకు ఎటువంటి సంబంధం లేదని అగ్రిమెంట్ లెటర్ ను ముందుగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పోటీకి వేలల్లో వచ్చే దరఖాస్తుదారులను పూర్తిగా పరిశీలించి 20 మందిని మాత్రమే ఎంపిక చేస్తారు.

ఈ పోటీలకు ఎంపికైన తరువాత సుమారు 300 కిలోమీటర్లు.. నార్వే నుంచి స్వీడన్‌ వరకు వారం రోజులపాటు ఎముకలు కొరికే చలిలో ప్రయాణించాల్సి ఉంటుంది. సైబీరియన్‌, అలస్కా జాతులకు చెందిన ఆరు నుంచి పది హస్కీ కుక్కలతో కూడిన స్లెడ్జెస్‌ వాహనంపై ఈ ప్రయాణం పూర్తిచేయాలి. ఈ కుక్కలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడంతో అంత చలిని తట్టుకుని ప్రయాణం చేయగలుగుతాయి. ప్రపంచాన్ని పది రీజియన్‌లుగా విడదీసి, ఒక్కో రీజియన్‌లో 20-30 దేశాలుంటే ఆయా దేశాల నుంచి వచ్చిన అప్లికేషన్లలో ఇద్దరిని మాత్రమే ఎంపిక చేస్తారు. భారత్‌ ఉన్న రీజియన్‌లో సుమారు 30 దేశాలు ఉంటే తాను నాలుగోస్థానంలో ఉన్నట్టు జయరాజ్‌ తెలిపాడు. ఓటింగ్‌ చేయాలనుకునేవాళ్లు.. జయరాజ్‌ గేదెల ఫేస్‌బుక్‌ పేజీలోకి వెళ్లి, http://polar.fjallraven.com లో ఓటింగ్‌ చేయవచ్చన్నారు. ఓటింగ్‌కు రేపే (గురువారం,డిసెంబర్-14) చివరి తేది. ఓటింగ్‌ చేయడం ద్వారా దేశం తరపున ఈ పోటీల్లో పాల్గొనే మొదటివ్యక్తిగా తనకు అవకాశం కల్పించాలని కోరాడు జయరాజ్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy