జింబాబ్వేలో ఆర్థిక సంక్షోభం.. మందులు కొనలేక చనిపోతున్నారు

పెరుగుతున్న ధరలతో జింబాబ్వేలో ఆర్థిక సంక్షోభం ముదురుతోంది. నిత్యావసరాల ధరలు సామాన్యు డికి అందనంత ఎత్తుకు చేరుతున్నాయి. తిండి మాటెలా ఉన్నా మందుల ధరలు ఆకాశాన్ని తాకడంతో రోజూ మందులు వాడాల్సిన రోగులు దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. మెడిసిన్‌ సప్లై తగ్గడం, డిమాండ్‌ వేగంగా పెరుగుతుండడంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మందులు కొనలేక రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు.

రాబర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముగాబే పదవిలోంచి దిగిపోయి ఏడాది గడిచినా జింబాబ్వేలో పరిస్థితులు ఏమాత్రం మారలేదు. దేశ ఆర్ధిక పరిస్థితిని గాడిలో పెడతానంటూ గద్దె నెక్కిన ఎమ్మర్సన్‌ నంగాగ్వా పాలనలో కూడా ప్రజలను కష్టాలు తగ్గలేదు. 1980 నుంచి గతేడాది వరకూ 37 సంవత్సరాల పాటు ముగాబే జింబాబ్వేను పాలించారు. ఆ సమయంలో రాయితీలలో కోత పెట్టడంతో వ్యవసాయ రంగం కుప్పకూలింది. సాగు గిట్టుబాటు కాక రైతులు, కూలీలు విదేశాలకు వలస వెళ్లారు. పెట్టుబడిదారుల్లేక ఆ రంగం కుదేలయ్యింది. ముగాబే అనుసరించిన విధానాలే దీనికి కారణమని మిలటరీ కలుగజేసుకుంది. ముగాబే రాజీనామాకు పట్టుబట్టింది. నంగాగ్వాకు పట్టం కట్టింది.

ఆయన పదవిలోకొచ్చి ఏడాది గడిచింది. కానీ ధరలు మాత్రం దిగిరాలేదు. అన్నింటా,అంతటా కొరత ప్రజలను వేధిస్తోంది. తినే తిండి నుంచి ఇంధనం దాకా అన్నింటా కొరతే.. దీంతో ఉన్న కొద్ది సరుకులకూ రేట్లు విపరీతంగా పెరిగాయి. ధరల పెరుగుదలకు కారణం మిలిటరీ జోక్యమేనని ప్రజల్లో ఆగ్రహం నెలకొంది. దేశ ఆర్థిక పరిస్థితి చక్కబడాలంటే కొండలా పెరిగిన అప్పులు చెల్లించే దారులను వెతకడంతో పాటు పెట్టుబడిదారులను ఆకరించ్షడం, అంతర్జాతీయ సాయం పొందడం నంగాగ్వా ముందున్న మార్గమని విశ్లేషకులు చెపుతున్నారు.

పన్ను పెరిగింది.. పోటు మిగిలింది

జింబాబ్వేలో ఎలక్ట్రానిక్‌ ట్రాన్సాక్షన్ల పైనే ప్రజలు ఆధారపడతారు. స్థానిక కరెన్సీ పై నమ్మకం లేక అమెరికన్‌ డాలర్లలో లావాదేవీలు జరుపుతారు. దీంతో ఆదాయం పెంచుకోవడానికి సర్కారు ఈ ట్రాన్సాక్షన్ల పై పన్నును 2 శాతం పెంచింది. ఈ నిర్ణయం ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టకపోగా.. ప్రజలకు కొత్త కష్టాలను తీసుకొచ్చింది. సప్లై చైన్‌ పై ఈ నిర్ణయం విపరీతమైన ప్రభావం చూపింది. అదే విధంగా వస్తువుల కొరత ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇది బ్లాక్‌ మార్కెటింగ్‌కు దారితీసింది. గతంలో లీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటనూనె 3.70 డాలర్లకు దొరికేది. ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెంచాక ఇది కాస్తా 12 డాలర్లకు చేరింది. మెడికల్‌ షాపులను తాత్కాలికంగా బంద్‌ చేసి మందుల ధరలను అప్‌డేట్ చేశాక తిరిగి వీటిని ఓపెన్‌ చేశారు. ఇక్కడ చెల్లింపులను డాలర్లలోనే అనుమతిస్తు న్నారు. గత నెలలో రేషన్‌ ద్వారా ప్రభుత్వం అందించే పెట్రోల్‌ కోసం జనం బారులుతీరారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy