ఘోర ప్రమాదం.. బస్సులో గ్యాస్ ట్యాంక్ పేలి 42 మంది మృతి

జింబాబ్వేలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సులో గ్యాస్ ట్యాంక్ పేలడంతో 42 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, సుమారు 20 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీస్ అధికారులు తెలిపారు. బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్యాసింజర్ కు చెందిన గ్యాస్ ట్యాంక్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

దేశ రాజధాని హరారే కు 550 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్వాండా జిల్లాలో ఈ యాక్సిడెంట్ జరిగింది.  జింబాబ్వే లో గత వారం రెండు బస్సులు ఢీ కొనడంతో సుమారు 50 మంది మృతి చెందారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy