జియోకి చుక్కలే : వైఫై డబ్బాలు వస్తున్నాయ్

wifiజియో.. టెలికాం కంపెనీలను మటాష్ చేసినా.. కొత్త తరం కుర్రోళ్ల ఆలోచనలకు మాత్రం పని చెప్పింది. జియోతో డేటా చీప్ అయ్యిందని అందరూ అనుకుంటుంటే.. అంతకంటే మరింత చౌకగా డేటా ఇస్తాం.. ఎక్కడ కావాలంటే అక్కడ వైఫైతో కనెక్ట్ అయ్యి వాడేసుకోండి అంటోంది బెంగళూరుకి చెందిన ఇంటర్నెట్ డేటా. గతంలో రూపాయి కాన్ బాక్స్ లు ఉన్నట్లు.. ఇప్పుడు wifi డబ్బాలు తీసుకొచ్చింది. బెంగళూరులో ఇప్పుడు ఏ చిన్న షాపు దగ్గర చూసినా ఈ డబ్బాలు దర్శనం ఇస్తున్నాయి. బెంగళూరు సిటీలో 350 వైఫై డబ్బాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. మరో 1800 కనెక్షన్స్ పెండింగ్ లో ఉన్నాయని చెబుతున్నారు కంపెనీ ప్రతినిధులు

వైఫై డబ్బాలు ఎలా పని చేస్తాయి :

రూటర్లను డబ్బాల్లో వివిధ ప్రాంతాల్లో పెడతారు. 200 మీటర్ల దూరం వరకు కనెక్ట్ అవుతుంది. 50mbps స్పీడ్ వస్తుంది. 100mb – రూ.2, 500 mb – రూ.10, 1GB – రూ.20. వ్యాలిడిటీ 24 గంటలు. ఈ వైఫై డబ్బాలను షాపుల దగ్గర ఏర్పాటు చేస్తారు. అందులో మీకు కావాల్సిన ప్యాకేజీకి ఓచర్ కార్డు కొనుగోలు చేసుకోవాలి. సంబంధిత వెబ్ సైట్ కు వెళ్లి మన ఫోన్ – కార్డులోని నెంబర్ ను ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తోంది. దాన్ని ఎంటర్ చేయగానే వైఫై కనెక్ట్ అవుతుంది. మనం మొబైల్ నంబర్ ను రీఛార్జ్ చేసుకున్న విధంగానే ఉంటుంది. మొబైల్ ప్రీ పెయిడ్ కస్టమర్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. కనీసం రూ.2 నుంచి రూ.20 వరకు ప్యాకేజీలు ఉన్నాయి. 1GB డేటాను 20 రూపాయలకే అందిస్తున్నారు. ప్యాకేజీలతో కాకుండా ఎప్పుడుకావాలంటే అప్పుడు 2, 10 రూపాయల్లో వైఫై డబ్బా అందుబాటులో ఉండటంతో ఒకేసారి వందలకు వందల రూపాయలు చెల్లించే బాధ తప్పిందంటున్నారు బెంగళూరువాసులు.

ప్రస్తుతం బెంగళూరు సిటీలో విస్తరిస్తున్న వైఫై డబ్బాలు.. రాబోయే రోజుల్లో మన సిటీకే కాకుండా పల్లెపల్లెకి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy