జియో ఎఫెక్ట్ : ఎయిర్ టెల్ రెండు బంపరాఫర్స్

airtelజియో ఆఫర్లకు దీటుగామిగతా టెలికాం రంగ సంస్థలు కూడా ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఎయిర్‌‌టెల్ కొత్తగా తమ కంపెనీ ప్రీపెయిడ్ సిమ్ తీసుకునే వినియోగదారులకు బంపర్ ఆఫరిచ్చింది. జియో ఇటీవలే కొత్త ప్లాన్స్‌ను ప్రకటించడంతో ఎయిర్‌‌టెల్ వినియోగదారులను ఆకర్షించేందుకు సరికొత్తగా రెండు ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

కేవలం రూ. 293తో కొత్తగా సిమ్ తీసుకునే వారికి 84 జిబీ 4జీ డేటా 84 రోజుల వరకూ అందజేయనున్నట్లు ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రీ పెయిడ్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆఫర్‌‌లో ఎయిర్‌టెల్ టూ ఎయిర్‌టెల్‌కు అన్‌లిమిటెడ్ కాల్స్‌ మాట్లాడుకోవచ్చని సంస్థ తెలిపింది.

మొదటి ఆఫర్: రూ. 293 ప్లాన్ లో ఎయిర్‌టెల్ టూ ఎయిర్‌టెల్‌కు మాత్రమే అన్‌లిమిటెడ్ కాల్స్‌ మాట్లాడుకోవచ్చు. డెయిలీ డేటా 1జీబీ అంటే 84  రోజులకు… 84GB.

రెండో ఆఫర్:  రూ. 449 ప్లాన్ లో ఎయిర్ టెల్ నుంచి ఎనీ నెట్ వర్క్ తో అన్‌లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. డెయిలీ 1GB తో 4G డేటా. దీని కాలపరిమితి  84 రోజులు మాత్రమే.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy