
ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. 5GB డేటా మాత్రమే కాకుండా 16GB ఎక్స్ ట్రా డేటాను జియో ఆఫర్ చేస్తోంది. అంటే మొత్తంగా నెలకు 156GB డేటాను యూజర్లు పొందుతారు. రెండో ప్లాన్ కింద పైన తెలిపిన ప్రయోజనాలే 98 రోజుల పాటు అందనున్నాయి. రోజుకు 5GB డేటా, ఈ ప్లాన్ పై ఎక్స్ ట్రా 48GB డేటాను 4G స్పీడులో యూజర్లకు జియో ఆఫర్ చేయనుంది. దీంతో మొత్తంగా 98 రోజుల పాటు 538GB డేటాతో యూజర్లు పండుగ చేసుకోవచ్చు. మూడో ప్లాన్ 4 వేల199 రూపాయల ప్లాన్. ఈ ప్లాన్ 196 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాక్ పై కూడా రోజుకు 5GB డేటాను, ఎక్స్ ట్రాగా 96GB డేటాను యూజర్లు పొందవచ్చు. అంటే మొత్తంగా యూజర్లు 1076GB డేటాను పొందనున్నారు.
ఈ మూడు ప్యాక్ లపై జియో యాప్స్ కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ ను పొందవచ్చు. మంచి నెట్ వర్క్ ఉండి కూడా సమస్యలు ఎదుర్కొనే వారికి జియోలింక్ సర్వీసులు ఎంతో ఉపయోగకరం. ప్రస్తుతం జియో లింక్ సర్వీసులు కమర్షియల్ గా ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇవి టెస్టింగ్ దశలో ఉన్నట్టు తెలిసింది. త్వరలోనే ఈ సర్వీసులను కూడా రిలయన్స్ జియో కమర్షియల్గా లాంచ్ చేయబోతుంది. జియోలింక్ డివైజ్ హాస్పాట్ డివైజ్ కంటే ఎక్కువ. వైర్డ్ కనెక్షన్ లో ఎలాంటి పరిమితులు లేకుండా.. హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సస్ ను అందించడమే జియోలింక్ డివైజ్ ఉద్దేశం.