జియో ధన్ ధనాధన్ కు పోటీగా ఎయిర్ టెల్ ఆఫర్!

airtelజియో ప్రకటించిన ధన్ ధనాధన్ ఆఫర్ కు పోటీగా ఎయిర్ టెల్ కూడా బరిలోకి దిగేందుకు  సిద్ధమైంది. సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తో కస్టమర్లను ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. కొత్త ప్లాన్‌ ప్రకారం రూ. 399తో రీచార్జి చేసుకుంటే 70 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1 జీబీ 4జీ డేటా వస్తుంది, దాంతోపాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ కూడా చేసుకోవచ్చు. అయితే, ఇదంతా 4జీ సిమ్‌ కార్డుతో పాటు 4జీ సదుపాయం ఉన్న ఫోన్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ విషయాన్ని ప్రముఖ టెలికం బ్లాగర్‌ సంజయ్‌ బఫ్నా ట్వీట్‌ చేశారు. రిలయన్స్‌ జియో అన్‌లిమిటెడ్‌ కాల్స్‌,డేటా ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం టెలికం రంగంలో టారిఫ్‌ వార్‌ జోరుగా నడుస్తోంది.  పోటీకి తగినట్టుగా రోజుకు 1జీబీ, 2జీబీ డేటా లిమిట్‌తో వేర్వేరు ప్లాన్లు ప్రకటించాలని కూడా ఎయిర్‌టెల్‌ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే కంపెనీ నుంచి ఇంతవరకు దీనిపై అధికారిక ప్రకటన ఏమీ రాలేదు.

One Response to జియో ధన్ ధనాధన్ కు పోటీగా ఎయిర్ టెల్ ఆఫర్!

  1. Anonymous says:

    In future the internet to every Indian citizens may become the fundamental right 😂😂…..

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy