జియో ఫోన్ : ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు

jio4g

జియో ఫోన్ కౌంట్ డౌన్ మొదలైంది. 15వ తేదీ విడుదల అవుతుంటే.. 24 నుంచి బుకింగ్స్ ఓపెన్. సెప్టెంబర్ ఒకటి నుంచి కస్టమర్ల చేతిలో జియో ఫోన్ రింగ్ రింగ్ అని మోగేలా రిలయన్స్ ప్లాన్ చేస్తోంది. రూ.1,500 రిఫండ్ తో ఫ్రీగా అందిస్తుండటంతో అందరికీ ఆసక్తి నెలకొంది. ఒక్కొక్కరికి ఒక ఫోన్ మాత్రమే ఇస్తారా లేక ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారా అనే డౌట్ అందరిలో ఉంది. ఈ క్రమంలోనే జియో ప్రకటన విడుదల చేసింది. పర్సనల్, బిజినెస్ ఆప్షన్స్ ఇస్తోంది. బిజినెస్ మోడ్ కింద.. ఎన్ని ఫోన్లు కావాలంటే.. అన్ని ఇస్తాం అని తెలిపింది.

ఈనెల 24 నుంచి ఈ ఫోన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరి చేతిలో జియో ఉండేలా.. యూజర్లు బుక్‌ చేసుకోవడం మిస్‌ కాకూడదని కంపెనీనే స్వయంగా ప్రమోషన్‌ మొదలుపెట్టింది. ఈ ఫోన్‌ పొందడానికి, దాని అప్‌డేట్లను తెలుసుకోవడం కోసం జియో డాట్ కామ్ లో రిజిస్ట్రర్‌ పేజీని తీసుకొస్తుంది.

కీప్‌ మి పోస్టెడ్‌ పేరుతో ఒక రిజిస్ట్రేషన్‌ పేజీని తన వెబ్‌సైట్‌లో ఉంచుతుంది. ఒక వ్యక్తికి ఒక్క ఆప్షన్‌ మాత్రమే ఉంటుంది. అయితే వ్యాపారుల కోసం మరో ఆప్షన్ ఇస్తుంది. బిజినెస్‌ అనే ఆప్షన్‌ను కొత్తగా చేర్చనుంది. బిజినెస్ కింద.. ఎన్ని ఫోన్లు కావాలంటే అన్ని ఫోన్లు ఇవ్వటానికి జియో సిద్ధంగా ఉంది.

కాంటాక్ట్‌ నేమ్‌, కంపెనీ పేరు, పిన్‌ కోడ్‌, పాన్‌ లేదా జీఎస్టీఎన్‌ నెంబర్‌, ఈమెయిల్‌ ఐడీ, కాంటాక్ట్‌ చేయాల్సిన వ్యక్తి నెంబర్‌, ఎన్ని డివైజ్‌లు అవసరమో తెలుపుతూ రిజిస్ట్రర్‌ చేసుకుంటే, బల్క్‌గా ఆర్డర్లను పొందవచ్చు. 1 నుంచి 50 వరకు, ఆపైనా బల్క్‌ ఆర్డర్లను బిజినెస్‌ కస్టమర్లు చేపట్టవచ్చని తెలిపింది జియో. జియో ఆప్షన్స్, రిజిస్ట్రేషన్ వివరాలు అన్నీ కూడా ఆగస్ట్ 15వ తేదీ నుంచి జియో కాట్ కామ్ వెబ్ పేజీలో అందుబాటులో ఉంటాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy