జియో ఫోన్ బుకింగ్ ప్రారంభం : ఆన్ లైన్ లో రూ.500లే చెల్లింపు

23brk-139జియో 4జీ ఫీచర్‌  ప్రకటించిన నాటి నుంచి ఫోన్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. ఇప్పుడు ఆ సమయంరానే వచ్చింది. రిలయన్స్‌ జియో 4జీ ఫీచర్‌ ఫోన్స్‌ ప్రి బుకింగ్‌ గురువారం నుంచి( ఆగస్టు-24) ప్రారంభం కానుంది. ఫోన్‌ కావాలనుకుంటున్న వారు రిలయన్స్‌ రిటైల్‌ స్టోర్స్, జియో వెబ్‌సైట్, జియో యాప్‌ ద్వారా సాయంత్రం 5 గంటల నుంచి రూ.500తో ప్రి–బుకింగ్‌ చేసుకోవచ్చు. ఫోన్ల డెలివరీ (సెప్టెంబర్‌లో) సమయంలో మిగతా రూ.1,000 చెల్లిస్తే సరిపోతుంది. ఫోన్‌ కొనుగోలుకు వెచ్చించిన మొత్తం రూ.1,500ను కస్టమర్‌ 36 నెలల తర్వాత తిరిగి తీసుకోవచ్చు. ఇక బుకింగ్స్‌ను ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం..

ఆఫ్‌లైన్‌లో బుకింగ్స్‌
* జియో అవుట్‌లెట్‌, జియోఫోన్లు సేల్స్ షాప్స్ లో మాత్రమే ఈ బుకింగ్‌ చేసుకోవచ్చు.
* బుకింగ్‌ సమయంలో ఆధార్‌ కార్డు అవసరం. ఒక ఆధార్‌ నంబరుపై ఒక ఫోన్‌ మాత్రమే ఇస్తారు.
* ఆధార్‌ వివరాలు, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎంట్రీ చేసిన తర్వాత మీకో టోకెన్‌ నంబర్‌ను ఇస్తారు.
* ఈ టోకెన్‌ నెంబరు ఫోన్‌ డెలివరీ సమయంలో అవసరమవుతుంది.

ఆన్‌లైన్‌లో..
* ఆన్‌లైన్‌లో బుకింగ్‌ కోసం జియో.కామ్‌, జియో ఫ్రీ ఫోన్‌.ఆర్గ్‌ సైట్‌లోకి వెళ్లాలి.
* సైట్‌లోకి వెళ్లాక ఫ్రీ మొబైల్‌ ఫోన్‌ రిజిస్ట్రేషన్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.
* అక్కడ పేరు, వ్యక్తిగత వివరాలు, ఆధార్‌ నంబర్‌, అడ్రస్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది.
* ఫస్ట్‌ కం ఫస్ట్‌ సర్వీస్‌ ఆధారంగా ఫోన్‌ డెలివరీ చేస్తారు. సెప్టెంబర్‌లో ఫోన్‌ మీ చేతికి అందుతుంది. ఫలానా తేదీన ఫోన్‌ అందిస్తామని జియో ఇప్పటి వరకు వెల్లడించలేదు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy