జియో ఫోన్ సంచలనం : రూ.153కే అన్ లిమిటెడ్ డేటా

jio-smart-phoneజియో స్మార్ ఫోన్ వస్తునే సంచలనాలు చేసింది. ఫోన్ ఫ్రీ అంటూనే.. దిమ్మతిరిగే ప్యాకేజీ ప్రకటించింది రిలయన్స్. రిలయన్స్‌ 40వ ఏజీఎం  సమావేశంలో ఇండియాస్‌ ఇంటిలిజెంట్‌ ఫోన్‌ అంటూ ముకేష్‌ అంబానీ  ఈ ఫోన్‌ను ఆవిష్కరించారు.  టారిఫ్స్ కూడా త‌న‌దైన స్టైల్లో ప్ర‌క‌టించారు.

 

జియో ఫోన్ ప్లాన్స్…

… రూ.153కే నెల రోజుల వ్యాలిడిటీతో అన్‌ లిమిడెట్‌ డేటాతోపాటు వాయిస్ కాల్స్ ఫ్రీ

… జియో ధ‌నాధ‌న్ ప్యాకేజీలో నెలకు రూ.309తో కేబుల్ తో ఫోన్ – టీవి కెనెక్ట్ చేసుకునే సదుపాయం

… స్మార్ట్ టీవీలే కాదు.. సాధార‌ణ పాత టీవీల‌కు కూడా ఈ కేబుల్‌ను క‌నెక్ట్ చేయొచ్చు. దీని ద్వారా జియో ఫోన్ స్క్రీన్‌పై వ‌చ్చే వీడియోలను టీవీలో పెద్ద స్క్రీన్‌పై చూసుకోవ‌చ్చు

… రోజుకు 3 నుంచి 4 గంట‌లు న‌చ్చిన వీడియోల‌ను టీవీకి కనెక్ట్ చేసుకుని చూసుకోవ‌చ్చు

… వారం, రెండు రోజుల ప్యాకేజీల‌ను ప్ర‌క‌టించింది జియో. వారానికి రూ.54, రెండు రోజుల‌కు రూ.24తో కొత్త ప్యాకేజీలను తీసుకొచ్చింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy