జియో బ్రాడ్ బ్యాండ్ స్పెషాలిటీస్ ఇవే

JIO BRANDBANDటెలికం రంగంలో అతి తక్కువ ధరలతో ఆఫర్లను ప్రకటిస్తూ సంచలనం సృష్టిస్తున్న రిలయన్స్ జియో..లేటెస్ట్ గా బ్రాడ్ బ్యాండ్ సేవల్లోనూ దూసుకు పోయేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా 1100 నగరాల్లో ఇళ్లకి, సంస్థలకు జియో గిగా ఫైబర్‌ పేరుతో అత్యంత వేగవంతమైన అల్ట్రా హై–స్పీడ్‌ ఫిక్స్‌డ్‌ లైన్‌ ఫైబర్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలు ప్రారంభించనుంది.

గురువారం (జూలై-5) జరిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 41వ వార్షిక సాధారణ సమావేశం (AGM)లో ఈ విషయాలను వెల్లడించారు గ్రూప్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ.

జియోఫైబర్‌ తో బ్రాడ్‌ బ్యాండ్‌ లో  విప్లవాత్మక మార్పులు

జియో సేవలతో ఊహకందని రీతిలో మొబైల్‌ వినియోగదార్లను పెంచుకున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. మరో డిజిటల్‌ విప్లవానికి శ్రీకారం చుట్టింది. ఇపుడు ప్రతీ ఇంట్లోకి రానుంది. జియో గిగాఫైబర్‌ కోసం ఆగస్టు 15 నుంచి వినియోగదార్లు నమోదు చేసుకోవచ్చు. సేవలు ఎప్పటి నుంచి మొదలయ్యేదీ ఇంకా చెప్పనప్పటికీ.. ఈ సేవలు మాత్రం ఇంటి రూపును మార్చనున్నాయి.
ఎన్ని సదుపాయాలో:  ఫైబర్‌ టు ద హోమ్‌(FTTH ) టెక్నాలజీ ఆధారంగా ఇచ్చే ఈ జియోగిగాఫైబర్‌ ద్వారా హై స్పీడ్ తో ఇంటర్నెట్‌.. బిగ్ స్ర్కీన్ లుండే టీవీలపై అల్ట్రా హై డెఫినిషన్‌ ఎంటర్ టైన్ మెంట్,  మల్టీ పార్టీ వీడియో కాన్ఫరెన్సులు, వాయిస్‌ యాక్టివేటెడ్‌ వర్చువల్‌ అసిస్టెన్స్‌, వర్చువల్‌ రియాల్టీ గేమింగ్‌, డిజిటల్‌ షాపింగ్‌, స్మార్ట్‌ హోమ్‌ సొల్యూషన్స్‌.. ఇలా ఎన్నో సదుపాయాలను కంపెనీ అందివ్వనుంది.

అంటే ఈ బ్రాడ్‌ బ్రాండ్‌ ద్వారా హై స్పీడ్ అప్‌ లోడ్‌, డౌన్‌ లోడ్లు ఉంటాయి. సెకనులో పదో వంతులో ఎన్నో పనులు చేసుకోవచ్చు.  గిగాఫైబర్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ తో ఒక సెట్‌-టాప్‌ బాక్స్‌ ను కూడా ఇస్తారు. దీని వల్ల మనం టీవీని వాయిస్‌ కమాండ్‌ ఫీచర్‌ ద్వారా నడిపించవచ్చు. అదే విధంగా టీవీ ద్వారా కాల్స్‌ కూడా చేసుకోవచ్చు. ఇంటిలోకి ఫైబర్‌: చాలా వరకు ఫైబర్‌ నెట్‌ వర్క్‌ బిల్డింగ్‌ వరకు మాత్రమే వస్తాయి. ఆ తర్వాత కేబుల్‌ ద్వారా ఇంటింటికి లింక్ చేసుకోవాలి. దీని వల్ల ఇంటర్నెట్‌ వేగం చాలా తగ్గుతుంది. అయితే జియో గిగాఫైబర్‌ మాత్రం FTTH పరిజ్ఞానం కారణంగా డైరెక్ట్ గా ఇంట్లోకి వస్తుంది. దీని వల్ల స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం వేల కొద్దీ ఇళ్లలో ప్రయోగాత్మక పరీక్షలు జరుగుతున్నాయి.

రేటు తెలియదు : ప్రస్తుతానికి సేవలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయన్నది బయటకు వెల్లడి కాలేదు. అదే విధంగా ఎంత టారిఫ్‌ ఉంటుందన్నదీ తెలియదు. అయితే  100 MBPS స్పీడ్ తో హై స్పీడ్ బ్రాడ్‌ బ్యాండ్‌ ను రిలయన్స్‌ ఆఫర్‌ చేసే అవకాశం ఉంది. ప్రస్తుత 4జీ పథకాలను ఈ బ్రాడ్‌ బ్యాండ్‌ తో కలిపి అందించే అవకాశం ఉంది కాబట్టి మొత్తం మీద మొబైల్‌ సేవల మార్కెట్‌ పైనా దీని ప్రభావం పడుతుంది. మొబైల్‌ టెలిఫోన్‌ మార్కెట్లో జియో తీసుకొచ్చినంత ఒత్తిడి తాజా బ్రాడ్‌ బ్యాండ్‌ విషయంలో తీసుకురాకపోవచ్చని అభిప్రాయపడ్డారు కాయ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ మాథ్యూస్‌.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy