జియో బ్రాడ్ బ్యాండ్: 1.1 టీబీ ఫ్రీ డేటా

jioఆఫర్లతో సంచలనం సృష్టించడంతో పాటు ఇతర టెలికాం సంస్థలను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది రిలయన్స్ జియో. తాజాగా జియో, బ్రాడ్‌బ్యాండ్‌ మార్కెట్‌లోనూ తనదైన మార్క్ ను చాటేందుకు వచ్చేస్తోంది. జియోఫైబర్‌ పేరుతో త్వరలో ఈ సర్వీసులను కమర్షియల్‌గా లాంచ్‌ చేయబోతోంది. ప్రస్తుతం యూజర్లకు ఫ్రీ డేటాతో ఫైబర్‌-టూ-ది-హోమ్‌ ప్రీవ్యూ ప్లాన్లను ఆఫర్‌ చేస్తోంది. ఈ ప్రీవ్యూ ప్లాన్‌లలో భాగంగా ఇనిషియల్‌ ప్లాన్‌ కింద 1.1TB వరకు డేటాను యూజర్లకు అందిస్తున్నట్టు రిపోర్టులు తెలిపాయి. ప్రస్తుతం ఈ సర్వీసులను ఎంపిక చేసిన నగరాలు అహ్మదాబాద్‌, చెన్నై, జమ్నానగర్‌, ముంబై, న్యూఢిల్లీ నగరాల్లో జియో టెస్ట్‌ చేస్తోంది. ఈ ఏడాది చివరిలో జియోఫైబర్‌ సర్వీసులను కమర్షియల్‌గా లాంచ్‌ చేయబోతున్నారు. బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులు మంచి ట్రాక్‌లో ఉన్నట్టు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ గతేడాది జూలైలో ప్రకటించారు కూడా.

100 MBPS స్పీడులో నెలకు 100GB ఉచిత డేటాను జియోఫైబర్‌ ఇన్‌షియల్‌ ప్లాన్‌ కింద ఆఫర్‌ చేస్తుందని  సంస్థకు చెందిన వ్యక్తులు చెప్పారు. ఒక్కసారి ఈ ఎఫ్‌యూపీ అయిపోతే.. టాప్‌ అప్‌ల తో 40GB ఫ్రీ డేటా అందుబాటులోకి తెస్తుందని, ఇలా నెలలో 25 సార్లు అందించి మొత్తంగా 1.1TB ఉచిత డేటాను ఆఫర్‌ చేస్తుందని తెలిపారు. అయితే ఈ 1.1TB డేటాను 100MBPS స్పీడులో అందిస్తుందో లేదో ఇంకా స్పష్టంగా తెలియలేదు. గృహవినియోగదారులకు, వ్యాపార కస్టమర్లకు ఇద్దరికీ ఈ సర్వీసులను అందుబాటులోకి తెస్తామని, 30 నగరాల్లో 100 మిలియన్‌ టెలివిజన్‌ కస్టమర్లను టార్గెట్‌గా తీసుకుని వీటిని ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది.  రూ.4500 ఇంటరస్ట్‌ ఫ్రీ సెక్యురిటీ డిపాజిట్‌తో జియోఫైబర్‌ కనెక్షన్‌  మొదట మార్కెట్‌లోకి వస్తుందని, తర్వాత ఈ మొత్తాన్ని కంపెనీ రీఫండ్‌ చేయనుంది.

 

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy