జియో ల్యాప్ టాప్ వచ్చేస్తోంది

jio-laptopమొన్నఉచిత డేటా.. నిన్న తక్కువ ధరకే సెటాప్ బాక్స్ లు విడుదల చేసిన జియో తాజాగా 13.3 ఇంచెస్ ల్యాప్ టాప్ ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఆ ల్యాప్ టాప్ లో జియో సిమ్‌లను వేసుకునే విధంగా రూపొందినట్టుగా తెలుస్తోంది.

జియో తీసుకురానున్న ల్యాప్‌టాప్ ఫీచర్లు ఇప్పుడు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. 13.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, విండోస్/క్రోమ్ ఓఎస్/ఆండ్రాయిడ్ ఓఎస్, హెచ్‌డీ వెబ్ కెమెరా, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64/128 జీబీ హార్డ్ డిస్క్, 10 గంటల బ్యాటరీ లైఫ్ వచ్చేలా జియో కొత్త ల్యాప్‌టాప్‌ ఉండనుంది. ఈ విషయంపై ఇప్పటికే చైనాకు చెందిన కొన్ని ల్యాప్‌టాప్ తయారీ సంస్థలతో జియో ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. ఈ ల్యాప్‌టాప్‌లను రూ.20వేల నుంచి రూ.40వేల మధ్య ధర ఉండే అవకాశముంది.

జియో విడుదల చేయనున్న ల్యాప్‌టాప్‌లు జియో 4జీ సిమ్‌తో రానున్నట్టు తెలిసింది. వాటిలో డిఫాల్ట్‌గా సిమ్‌ను ఇన్ సెట్ చేసి ఇవ్వనున్నారట. దీంతో జియో 4జీ ఇంటర్నెట్‌ను ఎప్పుడైనా.. ఎక్కడైనా ఆ ల్యాప్‌టాప్‌లో వాడుకోవచ్చు. సాధారణంగా ప్రయాణాల్లో ఉన్నప్పుడు ల్యాప్‌టాప్‌లకు ఇంటర్నెట్ కావాలంటే వైఫై లేదా డాంగిల్స్‌పై ఆధార పడాలి.. కానీ జియో సిమ్ అంతర్గతంగా ఇస్తే దాంతో ఇక యూజర్లు ఇంటర్నెట్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. దీనికి తోడు ఆ జియో సిమ్ ద్వారా కేవలం ఇంటర్నెట్‌ను మాత్రమే కాకుండా అన్ని జియో యాప్స్‌ను వాడుకోవచ్చు. 4జీ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఇందుకు వీలుగా ల్యాప్‌టాప్‌లో సాఫ్ట్‌వేర్‌ను జియో అందివ్వనున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy