జియో షాకింగ్ : వచ్చే నెలలో ఫోన్ రిలీజ్

jio-mobile-3జియో ఫోన్ బుకింగ్ చేసుకున్న వారికి బ్యాడ్ న్యూస్ వినిపించింది రిలయన్స్. కోట్లాది మంది ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రిలయెన్స్ జియో ఫీచర్ ఫోన్ డెలివరీ డేట్ మళ్లీ వాయిదా పడింది. డిమాండ్ ఎక్కువగా ఉన్నదంటూ జియో ఈ ఫోన్ డెలివరీని వాయిదా వేస్తూ వస్తున్నది. ఈ ఫోన్ కోసం ఆగస్ట్ 24న ప్రీ బుకింగ్స్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అప్పట్లో సెప్టెంబర్ మొదటి వారం నుంచే ఫోన్ల డెలివరీ ప్రారంభమవుతుందిన కంపెనీ తెలిపింది. అయితే డిమాండ్ ఎక్కువగా ఉన్న కారణంగా సెప్టెంబర్ 21 నుంచి ఇస్తామని మరో ప్రకటన విడుదల చేసింది. కానీ అదీ సాధ్యమయ్యేలా లేదు. తాజాగా మరో రిపోర్ట్ ప్రకారం.. అక్టోబర్ 1 తర్వాతే జియో ఫోన్లు కస్టమర్ల చేతికి అందనున్నట్లు సమాచారం.

ఇప్పటికే తమకు జియో నుంచి మెసేజ్ వచ్చిందని, ఫోన్ల డెలివరీ అక్టోబర్ 1కి వాయిదా వేసినట్లు చెప్పారని ఓ రీటెయిలర్ వెల్లడించాడు. దీనికి కారణం ఏంటన్నది మాత్రం చెప్పలేదు. ఇప్పటికే లక్షల మంది ఈ ఫోన్లను బుక్ చేసుకొని ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారు. కోటి మందికిపైగా మరోసారి ప్రీబుకింగ్ ఎప్పుడా అని నిట్టూరుస్తున్నారు. ఇలాంటి సమయంలో ఫోన్ల డెలివరీ వాయిదా పడటం కస్టమర్లను తీవ్ర అసంతృప్తికి గురిచేసేదే. ఈ ఫోన్లు తైవాన్ నుంచి రావాల్సి ఉంది. మొదట ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, అహ్మదాబాద్‌లకు ఈ ఫోన్లు వస్తాయి. అక్కడి నుంచి జియో సెంటర్లకు, రిలయెన్స్ డిజిటల్ స్టోర్లకు వెళ్తాయి. వాటి నుంచి డీలర్లు వీటిని తీసుకోవాల్సి ఉంటుంది. జియో ఫోన్ల డెలివరీ కోసం ఇతర లాజిస్టిక్ కంపెనీల సేవలను కూడా జియో వినియోగించుకోనున్నది.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy