జియో 100% క్యాష్ బ్యాక్ ఆఫర్

jioజియో ఫ్రీ ఆఫర్ ధాటిని తట్టుకోలేక మిగతా సంస్థలు కూడా ఫ్రీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. జియో ఉచిత ధోరణిపై మిగతా టెలికాం కంపెనీలు గగ్గోలుపెట్టినా ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు రిలయన్స్. మరోసారి తన కస్టమర్ల కోసం కొత్త సంచలన ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్యర్థి కంపెనీల పాత డాంగిల్, డేటా కార్డు, వైఫై రూటర్లను జియో వైఫై 4జీ రూటర్ తో ఎక్స్చేంజ్ చేసుకుంటే 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. రెండు ప్లాన్స్ తో జియో ఈ సంచలన ఆఫర్ ను ప్రకటించింది.

మొదటి ఆఫర్ : ఏ కంపెనీదైనా డేటా కార్డు, డోంగిల్, హాట్ స్పాట్ రూటర్ ను ఏ జియో డిజిటల్ స్టోర్ లో నైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. దానికి బదులుగా జీయో పై కొత్త రూటర్ ఇస్తారు. డివైజ్ ఎక్స్చేంజ్ కు రూ.2010 విలువైన 4జీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. జియోఫై రూటర్ పొందడానికి కస్టమర్లు రూ.1,999 చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.1999 కస్టమర్ చెల్లిస్తాడు. అతనికి రూ.2010 ఉచితంగా 4జీ డేటాను జియో ఇస్తోంది.

దాంతో పాటు 309 ప్లాన్ కింద కచ్చితంగా మొదటిసారి 408 రూపాయలతో (రూ.309+రూ.99) రీఛార్జ్ చేసుకోవాలి. 99 రూపాయల ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకుని ఉండాలి. కస్టమర్లు చెల్లించిన 1999 రూపాయలను 2010 రూపాయల విలువైన 4జీ డేటాతో మైనస్ చేస్తే కస్టమర్లకు ఇంటర్నెట్ కనెక్షన్ దాదాపు ఉచితంగా లభించనుంది.

సెకండ్ ఆఫర్: రెండో ప్లాన్ కింద యూజర్లు తమ డేటా కనెక్షన్లు ఎక్స్చేంజ్ చేసుకోవాల్సినవసరం లేదు. కచ్చితంగా రీఛార్జ్ చేపించుకోవాల్సిన 408 రూపాయలతో తొలి రీఛార్జ్ చేపించుకుంటే చాలు 1,999కే జియోఫై అందుబాటులో ఉంటుంది. కానీ దీనికింద కేవలం 1005 రూపాయల విలువైన 4జీ డేటాను మాత్రమే పొందడానికి అవకాశముంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy