జియో 4G.. ఫీచ‌ర్స్

JIOరిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ చైర్మ‌న్ ముఖేష్ అంబానీ ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్ అన్నీ సంచ‌ల‌నాల‌నే సృష్టిస్తున్న‌ది. తాజాగా ఈ ఫోన్ ప్రీ బుకింగ్స్ కూడా పెద్ద ఎత్తున జ‌రిగాయి. భారీ సంఖ్య‌లో ఫోన్ కోసం యూజ‌ర్లు బుకింగ్స్ చేసుకున్నారు. అయితే జియో 4జీ ఫీచ‌ర్ల వివరాలను తెలిపింది జియో.

ఫీచ‌ర్స్….

…జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్ 2.4 ఇంచ్ డిస్‌ప్లే.. రిజ‌ల్యూష‌న్ 320 x 240 పిక్స‌ల్స్‌.

…స్ప్రెడ్‌ట్ర‌మ్ లేదా క్వాల్‌కామ్ కంపెనీకి చెందిన ప్రాసెస‌ర్ ఉంటుంది. స్ప్రెడ్‌ట్ర‌మ్ అయితే 1.2 గిగాహెడ్జ్ సామ‌ర్థ్యం ఉన్న డ్యుయ‌ల్ కోర్ స్ప్రెడ్‌ట్ర‌మ్ ఎస్‌పీ9820ఎ ప్రాసెస‌ర్ ఉంటుంది. అదే క్వాల్‌కామ్ అయితే 1.1 గిగాహెడ్జ్ డ్యుయ‌ల్ కోర్ క్వాల్‌కామ్ 205 ప్రాసెస‌ర్ ఉంటుంది. యూజ‌ర్‌కు ల‌భించే జియో ఫోన్‌లో ఈ రెండింటిలో ఏదైనా ఒక ప్రాసెస‌ర్ ఉండే అవ‌కాశం ఉంది. రెండు కంపెనీల నుంచి పెద్ద ఎత్తున ప్రాసెస‌ర్‌ల‌ను దిగుమతి చేసుకుంది జియో.
జియో 4జీ ఫోన్‌లో 512 ఎంబీ ర్యామ్ ఉంది. 4జీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్..తో పాటు 128 జీబీ వ‌ర‌కు ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్ ఉంది. మెమొరీ కార్డుతో స్టోరేజీని పెంచుకోవ‌చ్చు.

….ఈ ఫోన్‌లో కొత్త‌గా KAI OSను ఏర్పాటు చేశారు. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ల‌కు భిన్న‌మైంది. ఈ ఫోన్ కోస‌మే ఈ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను తీర్చిదిద్దారు. MyJio, JioTV, JioCinema, JioChat, JioMusic, JioXpressNews వంటి జియో యాప్స్ అన్నీ ఈ ఫోన్‌లో వ‌స్తాయి. ఇంట‌ర్నెట్ బ్రౌజ‌ర్‌ను ఇవ్వ‌డంతో కావ‌ల్సిన సైట్‌ను ఓపెన్ చేసి నెట్‌ను చూసుకోవచ్చు. యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లను ఈ ఫోన్‌లో ప‌నిచేసేలా ప్ర‌త్యేకంగా యాప్‌ల‌ను అందివ్వ‌నున్న‌ట్టు సమాచారం.

….జియో 4జీ ఫోన్‌లో కేవ‌లం ఒకే సిమ్‌ను వేసుకోవ‌చ్చు. సింగిల్ సిమ్ వేరియెంట్‌లోనే ఈ ఫోన్‌ను అందిస్తున్నారు.

…వెనుక భాగంలో 2 మెగాపిక్స‌ల్ సామ‌ర్థ్యం ఉన్న కెమెరా ఉంది. ఫ్లాష్ లేదు. ముందు భాగంలో 0.3 మెగాపిక్స‌ల్ సామ‌ర్థ్యం ఉన్న వీజీఏ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. దీనికి కూడా ఫ్లాష్ లేదు.

…ఫోన్ పై భాగంలో టార్చి లైట్ ఉంటుంది. కింది భాగంలో 3.5 ఎంఎం ఆడియోజాక్‌, మైక్రో యూఎస్‌బీ స్లాట్ ఉంటాయి.

… వైర్‌లెస్ ఎఫ్ఎం ఫీచ‌ర్ ఉండ‌డం తో హెడ్‌ఫోన్స్ పెట్ట‌కుండానే ఎఫ్ఎం రేడియోను వినవచ్చు.

…4జీ VOLTE  ఉంది. దీంతో HD వాయిస్ కాల్స్ చేసుకోవ‌చ్చు. ప్ర‌త్యేక యాప్ అవ‌స‌రం లేదు.

… వైఫై ఇచ్చారు.  వైఫై హాట్ స్పాట్ ల‌కు ఈ ఫోన్‌ను క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు. కానీ ఇందులో వైఫై హాట్ స్పాట్ పెట్టుకునే అవ‌కాశం లేదు. దీంతో ఈ ఫోన్ ఇంట‌ర్నెట్‌ను ఇత‌ర డివైస్‌ల‌కు షేర్ చేయ‌లేం.

…బ్లూటూత్ 4.1 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ ఉండడంతో ఫైల్స్ వేగంగా షేర్ అవుతాయి.

…2000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఇందులో ఇచ్చారు. ఫీచ‌ర్ ఫోనే క‌నుక బ్యాట‌రీ బ్యాక‌ప్ ఎక్కువ‌గా వ‌స్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. దీని స్టాండ్ బై టైం 15 రోజులు.

…జియో మీడియాకేబుల్‌ను ఈ ఫోన్‌తోపాటు ఇస్తున్నారు. దీన్ని ఏ టీవీకైనా క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు. ఓ వైపు జియో ఫోన్‌కు క‌నెక్ట్ చేసి ఈ కేబుల్‌ను మ‌రోవైపు టీవీకి క‌నెక్ట్ చేస్తే దాంతో ఫోన్‌లో ఉన్న కంటెంట్ టీవీలో ప్లే అవుతుంది. జియో ధన్ ధ‌నా ధ‌న్ ప్యాక్ రూ.309తో రీచార్జి చేసుకుంటే రోజుకు 3, 4 గంట‌ల పాటు ఇలా టీవీలో వీడియోలు చూడ‌వ‌చ్చు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy