జిల్లాల్లో HCA క్రికెట్ గ్రౌండ్స్ : వివేకానంద

HCA-President-Vivekanandతెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల్లో మొదటి క్రికెట్ గ్రౌండ్ రెడీ చేసింది HCA. మహబూబ్ నగర్ లో రెడీ చేసిన గ్రౌండ్ ను ప్రారంభించారు HCA అధ్యక్షులు వివేకానంద్. అన్ని వసతులతో గ్రౌండ్లు తయారు చేసి.. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ ను అభివృద్ధి చేస్తామన్నారు వివేక్.

మహబూబ్ నగర్ లో క్రికెట్ గ్రౌండ్ కోసం ఐదెకరాల భూమిచ్చారు మాజీ మంత్రి వినోద్. నిధులు లేవంటూ అప్పట్లో గ్రౌండ్ వర్క్ మొదలుకాలేదు. ఇప్పుడు వివేకానంద్ HCA అధ్యక్షులైన తర్వాత.. ఐదు లక్షలు కేటాయించారు. దీంతో 15 రోజుల్లోనే గ్రౌండ్ ను సిద్ధం అయ్యింది. బోయపల్లి శివారులో ఉన్న ఈ క్రికెట్ గ్రౌండ్, నెట్ ప్రాక్టీస్ సెంటర్ ను ఓపెన్ చేశారు వివేకానంద్. మహబూబ్ నగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులతో కలిసి గ్రౌండ్ ను పరిశీలించారు వివేకానంద్. ప్రాక్టీస్ కోసం మంచి వసతులు కల్పిస్తామన్నారు. ప్రతిభ ఉన్న 10 మంది ప్లేయర్లకు ట్రైనింగ్ ఇప్పిచ్చి.. జాతీయస్థాయికి వెళ్లేలా HCA సాయం చేస్తుందన్నారు. స్థానిక ఎంపీ తన నిధుల నుంచి 50 లక్షలను.. మహబూబ్ నగర్ గ్రౌండ్ అభివృద్దికి ఇస్తున్నారని చెప్పారు.

పాలమూరు క్రికెట్ గ్రౌండ్ కు నిధుల లోటు రాకుండా అభివృద్ధి చేస్తమన్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. రాష్ట్రస్థాయి మ్యాచులకు పాలమూరు వేదికయ్యే విధంగా HCA చూడాలన్నారు. మారుమూల  గ్రామాల్లోకి క్రికెట్ ను తీసుకెళ్లి.. యువతను ప్రోత్సహించటమే తమ లక్ష్యమన్నారు HCA ఉపాధ్యక్షులు అరుణ్ కుమార్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy