జీఎస్టీకి వ్యతిరేకంగా వస్త్ర వ్యాపారుల సమ్మె

cloth merchantవస్త్ర పరిశ్రమను వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తేవడాన్ని నిరసిస్తూ వ్యాపారులు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నారు. వస్త్ర తయారీ పరిశ్రమలు, దుకాణాలు మూతపడ్డాయి. ఇంతకాలం ఎటువంటి పన్ను చెల్లింపు లేని చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై ప్రస్తుతం జీఎస్టీ ద్వారా ఐదు శాతం పన్ను విధించారు. ఇంతవరకు టెక్స్‌టైల్స్‌ను ప్రత్యేక ప్రాధాన్యంగల అత్యవసర సరుకుగా పరిగణించారు. ఇప్పుడు జీఎస్టీ కింద పన్ను విధిస్తే పరిశ్రమ వెన్నువిరుగుతుంది అని టెక్స్‌టైల్స్ ట్రేడర్స్ అసోసియేషన్ (టీటీఏ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశంలో వ్యవసాయం తరువాత అత్యధిక మందికి ఉపాధి నిస్తున్న టెక్స్‌టైల్ రంగంపై జీఎస్టీని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నారు వస్త్ర వ్యపారులు. వచ్చే జీఎస్టీ కౌన్సిల్‌లో దీనిపై నిర్ణయం తీసుకోకపోతే నిరవధిక నిర‌స‌న‌లు చేపడుతామని హెచ్చరించింది టీటీఏ.

వ్యాపారులతో పాటు వినియోగదారులపై అదనపు భారాన్ని మోపే జీఎస్టీని టెక్స్‌టైల్స్ రంగానికి మినహాయించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ టెక్స్‌టైల్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు అమ్మనబ్రోలు ప్రకాశ్ హెచ్చరించారు. ఫెడరేషన్‌తో పాటు సికింద్రాబాద్ క్లాత్ మర్చంట్ అసోసియేషన్, కట్‌పీస్ అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో వస్త్ర దుకాణాలు మూసివేసి సికింద్రాబాద్ జనరల్ బజార్ నుండి బట్టల బజార్, మహంకాళి వీధి, సుభాశ్ రోడ్‌ల మీదుగా ప్రదర్శన నిర్వహించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy