జీఎస్టీతో రూ.12 వేల కోట్ల భారం

gst-ktrవస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమలుతో తెలంగాణపై రూ. 12 వేల కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌. ఆదివారం ఢిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో తెలంగాణ తరఫున కేటీఆర్‌ హాజరయ్యారు.ఈ సమావేశంలో తాగు సాగునీరు, బలహీనవర్గాల ఇళ్లనిర్మాణం, గ్రానైట్, బీడీ,గర్రపు పందేలు,జౌళి రంగాలపై ఇప్పటివరకు వేసిన పన్నులను తిరిగి పరిశీలించాలని కోరుతూ 10 పేజీల పుస్తకాన్ని కౌన్సిల్ కు సమర్పించారు. ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు అందించేందుకు రాష్ట్రంలో రూ 40వేల కోట్లతో ‘మిషన్‌ భగీరథ’ చేపడుతున్నామని, దానిపై రెండు వేల కోట్లు, రూ.1.25 లక్షల కోట్లతో సాగు, తాగునీటి ప్రాజెక్టు కాంట్రాక్టులపై జీఎస్టీలో 18 శాతం పన్ను విధించడంతో 8 వేల కోట్లు భారం పడుతుందని తెలిపారు. కాంట్రాక్టు పనులను జీఎస్టీ పరిధి నుంచి పూర్తిగా తప్పించాలని, లేదా 5 శాతం పన్నుకు పరిమితం చేయాలని ప్రతిపాదించారు. తక్కువ ధరతో నిర్మించే సామాజిక ఇళ్ల సేవలపై 18 శాతం పన్ను విధించడం సరికాదని, సామాన్యులకే తక్కువ ధర ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందని కాబట్టి 5 శాతం పన్ను విధించాలని విజ్ఞప్తి చేశారు. బీడీ పరిశ్రమను జీఎస్టీ నుంచి మినహాయించాలన్నారు కేటీఆర్.
తెలంగాణలో వెయ్యి బీడీ తయారీ యూనిట్లు ఉన్నాయని, వాటి ద్వారా 5 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని కౌన్సిల్‌ దృష్టికి తీసుకెళ్లారు ఆయన. సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మిషన్‌ భగీరథ లాంటి కార్యక్రమాన్ని ప్రశంసించి ఆర్థికసాయం చేసి ప్రోత్సహించాలి తప్ప ఇబ్బంది పెట్టడం భావ్యం కాదన్నారు. రాష్ట్రంలో 20వేల కోట్ల ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని, జీఎస్టీతో ఈ ప్రాజెక్టులపై రూ. 8 వేల కోట్ల అదనపు భారం పడుతుందని వివరించారు. రూ. 18 వేల కోట్లతో హౌజింగ్‌ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని, దీనిపై 6800 కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు కేటీఆర్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy