జీశాట్‌-11 ప్రయోగానికి ఇస్రో అనుమతి

ISROభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) జీశాట్‌-11 ప్రయోగానికి అనుమతినిచ్చింది. ఫ్రెంచ్‌గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి మే 26న ప్రయోగించాల్సిన 5,700 కేజీల బరువున్న జీశాట్‌–11 ప్రయోగాన్ని ఇస్రో ఇంతకుముందు నిలిపివేసింది. ఈఏడాది మార్చిలో ప్రయోగించిన జీశాట్‌–6A విఫలం కావడంతో మరిన్ని పరీక్షలు చేసేందుకు వీలుగా ఇస్రో ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తిస్థాయిలో అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత ఉపగ్రహం దోషరహితంగా ఉండటంతో ప్రయోగానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఎక్కువ బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించే ‘ఏరియన్‌ స్పేస్‌’ సంస్థ స్లాట్‌ దొరకగానే జీశాట్‌–11ను కక్ష్యలో ప్రవేశపెడతామని ఇస్రో తెలిపింది. జీశాట్-11 నిర్మాణానికి మొత్తం రూ.500 కోట్లు ఖర్చయ్యింది

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy