జీహెచ్ఎంసీ ఎన్నికలకు సర్కారు కసరత్తు

GHMC-1-Rupee-tiffin-schemeGHMC  ఎన్నికలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఎన్నికల నిర్వహణలో ప్రధానమైన వార్డుల ముసాయిదా నోటిఫికేషన్ ను సోమవారం రిలీజ్ చేసేందుకు GHMC ప్లాన్ చేస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 150 వార్డులను రెగ్యులరైజ్ చేసిన అధికారులు… దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నారు. ఇందుకోసం 15 రోజుల గడువివ్వనున్నారు. ప్రజల అభిప్రాయాల తర్వాత.. ఏవైనా మార్పులుంటే.. ఫైనల్ జాబితాను సిద్దం చేస్తారు.గతంలో GHMCని 200 వార్డులుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో..150 వార్డులను కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చింది. దీంతో 2011 జనాభా లెక్కల ప్రకారం.. 44 వేల జనాభాకు ఓ వార్డు చొప్పున 150 వార్డులతో డ్రాఫ్ట్ ను రూపొందించారు. అయితే కొన్ని వార్డుల్లో  తక్కువగా… కొన్ని వార్డుల్లో మరీ ఎక్కువగా జనాభా ఉండటంతో.. జనాభా సరిసమానంగా ఉండేలా.. వార్డులను రెగ్యులరైజ్ చేసింది GHMC. వార్డుల విభజన కంప్లీట్ అయితే… తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టనుంది GHMC. కార్పొరేషన్లను పరిగణనలోకి తీసుకొని మేయర్ రిజర్వేషన్.. జనాభా ఆధారంగా మహిళా వార్డుల విభజన పూర్తి చేస్తారు. ఈ ప్రక్రియంతా పూర్తయ్యేసరికి జనవరి కావచ్చు… ఆ తర్వాతే.. GHMC ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ రిలీజ్ చేసే చాన్స్ ఉంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy