జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

GHMC44గ్రేటర్ హైదరాబాద్ నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది ప్రభుత్వం. జనవరి 12వ తేదీ నోటిఫికేషన్ విడుదల అవుతుంది.

 

 

 

నామినేషన్ల స్వీకరణ : 12 నుంచి 17వ తేదీ వరకు

నామినేషన్ల పరిశీలన : జనవరి 18

నామినేషన్ల ఉపసంహరణ గడువు : జనవరి 21

గ్రేటర్ పోలింగ్ : ఫిబ్రవరి 2

గ్రేటర్ కౌంటింగ్ : ఫిబ్రవరి 5

 

Nagireddyimageఅమల్లోకి ఎన్నికల కోడ్

జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. ప్రతీ పోలింగ్ లో ఐదుగురు సిబ్బంది ఉంటారని తెలిపారు. 30 మంది ఐఎస్ ఆఫీసర్లు ఎన్నికలను పరిశీలిస్తారన్నారు. మూడువేల కేంద్రాల్లో  లైవ్ వెబ్ కాస్టింగ్ ఉంటుందన్నారు. ఎన్నికల కోసం 12 వేల ఈవీఎంలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నగరంలో 3 వేలకు పైగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామన్న నాగిరెడ్డి…30 వేల మంది పోలీసులతో బందోబస్తు  ఏర్పాట్లు చేపట్టామన్నారు.  ఎక్కడైనా రీపోలింగ్ ఉంటే ఫిబ్రవరి 4న చేపడుతామన్నారు. ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు  జరుగుతుందన్నారు.

ఎవరికి- ఏ వార్డు 

ఎస్టీ (జనరల్) : ఫలక్ నుమా
ఎస్టీ మహిళ  : హస్తినాపురం
ఎస్సీ (జనరల్) : కాప్రా, మీర్ పేట హెచ్ బీ కాలనీ, జియాగూడ, మచ్చబొల్లారం, వెంకటాపురం
ఎస్సీ (మహిళ) : రాజేంద్రనగర్, కవాడిగూడ, అడ్డగుట్ట, మెట్టగూడ, బన్సీలాల్ పేట
బీసీ (జనరల్ ) : చర్లపల్లి, సిక్ చవనీ, సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట, శాలిబండ, గోషామహామల్, పురానాపూల్, దూద్ బౌలి,జహనుమా, రాంనాస్ పూరా, కిషన్ బాగ్, శాస్త్రిపురం, దత్తాత్రేయనగర్, కార్వాన్, నానల్ నగర్, మెహిదీపట్నం, గుడిమల్కాపుర్, అంబర్ పేట్, బోలక్ పూర్, బోరబండ, రాంచంద్రాపురం, పటాన్ చెరు, గాజులరామారం, జగద్గిరిగుట్ట, రంగారెడ్డి నగర్.

బీసీ (మహిళ) : రామంతాపూర్, పాత మలక్ పేట , తలాబ్ చంచలం, గౌలిపుర, కూర్మగూడ, కంచన్ బాగ్, బార్కాస్, నవాబ్ సాహెబ్ కుంట, ఘాన్సీ బజార్, సులేమన్ నగర్, అత్తాపూర్, మంగళ్ హట్, గోల్కొండ, టోలీచౌకీ,ఆసిఫ్ నగర్, విజయనగర్ కాలనీ, అహ్మద్ నగర్, మల్లేపల్లి, రెడ్ హిల్స్, గోల్నాక, ముషీరాబాద్, ఎర్రగడ్డ, చింతల్, బౌద్ధనగర్, రాంగోపాల్ పేట.

జనరల్ (మహిళ) : ఏఎస్ రావు నగర్, నాచారం, చిలుకానగర్, హబ్సీగూడ, ఉప్పల్, నాగోల్, సరూర్ నగర్, రామకృష్ణాపురం, సైదాబాద్, మూసారంబాగ్, ఆజాంపుర, ఐఎస్ సదన్, లంగర్ హౌజ్, గన్ ఫౌండ్రీ, హిమాయత్ నగర్, కాచీగూడ, నల్లకుంట, బాగ్ అంబర్ పేట, అడిక్ మెట్, గాంధీనగర్, ఖైరతాబాద్, వెంకటేశ్వర కాలనీ, సోమాజీగూడ, అమీర్ పేట్, సనత్ నగర్, హఫీజ్ పేట్ , చందానగర్, భారతీనగర్, బాలజీనగర్, అల్లాపూర్, వివేకానందనగర్ కాలనీ, సుభాష్ నగర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, అల్వాల్, నేరేడ్ మెట్, వినాయక్ నగర్, మౌలాలీ, గౌతంనగర్, తార్నాక, సీతాఫల్ మండీ, బేగంపేట్, మోండామార్కెట్.

జనరల్ : మల్లాపూర్, మన్సూరాబాద్, హయత్ నగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, హస్తీనాపురం, చంపాపేట్, లింగోజీగూడ, కొత్తపేట, చైతన్యపూరి, గడ్డిఅన్నారం, అక్బర్ బాగ్, డబీర్ పుర, రెయిన్ బజార్, పత్తర్ ఘట్టి, లలిత్ బాగ్, రియాసత్ నగర్, ఉప్పుగూడ, జంగంపేట్, బేగంబజార్, మైలార్ దేవ్ పల్లి, జాంబాగ్, రాంనగర్, బంజారాహిల్స్, షేక్ పేట్  జూబ్లీహిల్స్, యూసుఫ్ గూడ, వెంగళరావునగర్, రహమత్ నగర్, కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, కేపిహెచ్ బీ కాలనీ, మూసాపేట్, ఫతేనగర్, పాత బోయిన్ పల్లి, బాలానగర్, కూకట్ పల్లి, హైదర్ నగర్, అల్విన్ కాలనీ, సూరారం, ఈస్ట్ ఆనంద్ బాగ్, మల్కాజ్ గిరి

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy