‘జీ హుజూర్’ అనబోదు హుజూరాబాద్!

కరీంనగర్ జిల్లా అంటేనే ఉద్యమాల కోట. హుజూరాబాద్ నియోజకవర్గం దీనికి మినహాయింపు కాదు. తెలంగాణ ఆకాంక్ష కోసం ఒకే ఎమ్మెల్యేను మూడుసార్లు గెలిపించిన సెగ్మెంట్ ఇది. అభివృద్ధికి పాటుపడితే గుండెల్లో పెట్టుకుని చూసుకోవడం.. లేదంటే ఓటుతో కొట్టి ఇంట్లో కూర్చోబెట్టడం ఈ సెగ్మెంట్ ఓటర్లకే తెలిసిన తీర్పు. అవసరమైతే సంప్రదాయ రాజకీయపార్టీలను పక్కనబెట్టి తమ పక్షాన నిలబడే ఇండిపెండెంట్లకైనా పట్టంకట్టడం ఓటర్ల ప్రత్యేకత. రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరైన హుజురాబాద్ సెగ్మెంట్ పై స్పెషల్ స్టోరీ.

 • హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలో హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్, సైదాపూర్ మండలాలున్నాయి.
 • మొత్తం 92  గ్రామపంచాయతీలు, మరో 133 హామ్లెట్ గ్రామాలున్నాయి.
 • సెగ్మెంట్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 5 వేల 182.
 • వారిలో 1 లక్షా ఒక వేయి 924­­­ మంది మహిళలు,­ 1 లక్షా 3 వేల 258 మంది పురుషులున్నారు.
 • మొత్తం ఓటర్లలో ­64 శాతం బీసీలు, 2 శాతం ఎస్టీలు,  21 శాతం ఎస్సీలు, 8 శాతం ఓసీలు, ఇతరులు 5 శాతం ఉన్నారు.

………………………..

 • పునర్విభజన జరిగిన ప్రతీసారి హుజురాబాద్ రూపురేఖలు మారుతూ వచ్చింది.
 • 2009లోనూ సెగ్మెంట్ షేప్ మారింది.
 • ముందునుంచి విలక్షణ తీర్పుకు వేదికగా మారింది హుజూరాబాద్.
 • మొదటి మూడు ఎన్నికల్లో ఇండిపెండెంట్లు విజయం సాధించారు.
 • తర్వాత వరుసగా నాలుగుసార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.
 • 1983లో టీడీపీ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ కు హుజూరాబాద్ అందని ద్రాక్షే అయింది.
 • 1983 నుంచి రెండుసార్లు టీడీపీ, రెండుసార్లు టీఆర్ఎస్ అభ్యర్థులకు ఇక్కడి ఓటర్లు పట్టంగట్టారు.
 • 2004లో కమలాపూర్ నుంచి గెలిచిన ఈటెల రాజేందర్ 2009లో హుజూరాబాద్ నుంచి ఎన్నికయ్యారు.
 • మహాకూటమి పొత్తులో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు.
 • 2010 ఉప ఎన్నికల్లోనూ ఈటెల 50 వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు.
 • హుజురాబాద్ నియోజకవర్గం 1952 నుంచి 62 వరకు ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది.
 • కమలాపూర్ హుజురాబాద్ లోనే ఉండేది.
 • ఒకే నియోజకవర్గంలో ఒక స్థానం నుంచి ఎస్సీ, మరో స్థానం జనరల్ కు కేటాయించడంతో ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించేవారు.
 • 1967లో పునర్విభజన తర్వాత హుజురాబాద్, కమలాపూర్ నియోజకవర్గాలు ఏర్పాడ్డాయి.
 • మళ్లీ 2009 పునర్విభజనలో కమలాపూర్ ను రద్దు చేసి అందులోని మూడు మండలాలను హుజురాబాద్ లో విలీనం చేశారు.
 • దీంతో నియోజకవర్గం ముఖచిత్రం మారిపోయింది.

……………………………

 • 1952 లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న టైంలో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నమనేని నారాయణ రావు, సోషలిస్టు పార్టీ అభ్యర్థి జె.వెంకటేశం ఎమ్మెల్యేలుగా గెలిచారు.
 • 1962లో కమలాపూర్ నుంచి ఇండిపెండెంట్ గా నారాయణ రెడ్డి విజయం సాధించగా, హుజురాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జి.రాములు గెలిచారు.
 • 1967లో కాంగ్రెస్ నుంచి పొల్సాని నర్సింగరావు గెలిచారు.
 • 1972లో కాంగ్రెస్ నుంచి వొడితెల రాజేశ్వర్ రావు విజయం సాధించారు.
 • 1978లో హుజరాబాద్ నుంచి దుగ్గిరాల వెంకట్రావు గెలుపొందారు.
 • 1983లో టీడీపీ నుంచి హుజురాబాద్ ఎమ్మెల్యేగా కొత్తరాజిరెడ్డి విజయం సాధించారు.
 • 1985లో మధ్యంతర ఎన్నికల్లో దుగ్గిరాల వెంకట్రావు గెలిచారు.
 • 1989లో ఇండిపెండెంట్ గా అభ్యర్థి కేతిరి సాయిరెడ్డి విజయం సాధించారు.
 • 1994, 99లో టీడీపీ అభ్యర్థిగా ఇనుగాల పెద్దిరెడ్డి గెలుపొందారు.
 • టీఆర్ఎస్ ఎస్ ఆవిర్భావం తర్వాత 2004లో హుజురాబాద్ ఆ పార్టీకి కంచుకోటగా మారింది.
 • ఈ సెగ్మెంట్ నుంచి ఈటెల రాజేందర్ మూడుసార్లు గెలిచారు.

……………..

ఒకప్పుడు కరవు, కాటకాలతో విలవిల్లాడిన నియోజకవర్గంలో ఎస్సారెస్పీ కాలువ నుంచి సాగునీరందండతో దాదాపు 80 శాతం గ్రామాల రైతులు ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్నారు. జమ్మికుంట పత్తి మార్కెట్ తెలంగాణలోనే రెండో అతిపెద్ద మార్కెట్ గా గుర్తింపు పొందింది. ఈ మధ్యే హుజురాబాద్, జమ్మికుంట మేజర్ పంచాయతీలకు మున్సిపాలిటీ హోదా కల్పించారు.

 • హుజూరాబాద్ సెగ్మెంట్ ను టీఆర్ఎస్ కంచుకోటగా మార్చుకుంది.
 • పార్టీలో కీలక నేతగా ఉన్న ఈటెల రాజేందర్ వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
 • టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కీ పోస్ట్ లో ఉన్నారు.
 • 2009 ఎన్నికలకు ముందు ప్రధానంగా మూడు హామిలిచ్చారు ఈటెల.
 • జమ్మికుంటలో చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి, ఫైర్ స్టేషన్ నిర్మాణం, సబ్ ట్రైజరీ కార్యాలయం ఏర్పాటు చేస్తానని మాటిచ్చానని, ఈ హామీల్ని నెరవేర్చానని చెబుతున్నారు రాజేందర్.
 • 2004లో తొలిసారి కమాలాపూర్ నుంచి గెలిచిన ఈటెల.. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించడంలో విజయం సాధించారు.
 • 13 ఏళ్ల టీఆర్ఎస్ పోరాటంలో ఈటెల పాత్ర అమోఘం.
 • ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చటంతో ఈ అంశాలన్నీ ఈటెలకు సానుకూలంగా మారే అవకాశాలున్నాయి.
 • టీఆర్ఎస్ లో కీలక నేతగా ఎదిగారు ఈటెల రాజేందర్.

……………………..

 • అయితే, రాజేందర్ నియోజకవర్గంలోకన్నా హైదరాబాద్ లో బిజీగా ఉంటారన్న విమర్శ ఉంది.
 • ఉద్యమం కోసం బయటే గడపడంతో.. నియోజకవర్గాన్ని పట్టించుకోలేదన్న అసంతృప్తి జనంలో ఉంది.
 • గ్రామాల్లో మంచినీటి సమస్య, నియోజకవర్గంలో రోడ్లు లేకపోవడంలాంటి సమస్యలు తీర్చడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారన్న విమర్శలున్నాయి.
 • విద్యుత్ కోతలు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంపైనా ఈటెలకు మైనస్ గా మారాయి.
  ………………………
 • ఈసారి ఎన్నికల్లో సెంటిమెంట్ తో పాటు బలంగా పనిచేసే అంశాలు చాలానే ఉన్నాయి.
 • మానేరు చెరువును ఎగువ మానేరు ప్రాజెక్టుకు అనుసంధానిస్తే దిగువ భూములకు నీరందే చాన్సు ఉంది.
 • హుజురాబాద్ లో అంబేద్కర్ భవనం, కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఆగిపోయాయి.
 • వసతి గృహాల్లో కనీస సదుపాయాలు లేకపోవడం, జమ్మికుంటలో తాగునీటి సమస్య కీలకంగా మారాయి.
 • హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో 30 పడకలకు సరిపడా వైద్యులు లేకపోడవం, సిబ్బంది కొరత ర్చాలన్న డిమాండ్ కూడా అలాగే ఉంది.
 • ఇవన్నీ ఈటెలకు నెగిటివ్ గా మారే అవకాశముంది.

……………………….
ఎన్నికల దగ్గరకొస్తుండటంతో పొత్తులు కీలకంగా మారాయి. ఈసారి కాంగ్రెస్ తో సీపీఐ జట్టుకట్టింది. హుజురాబాద్ లో సీపీఐకి పట్టుంది. దీని వల్ల కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న సుదర్శనరెడ్డికి సీపీఐ సపోర్ట్ ప్లస్ పాయింట్ అవుతుంది. దీంతో ఈటెల రాజేందర్, సుదర్శన రెడ్డిల మధ్య గట్టి పోటీ జరిగే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఇక బీజేపీతో పొత్తుతో టీడీపీ నుంచి మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కొడుకు కశ్యప్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. తండ్రి మీద ఉన్న సానుభూతి తనను గెలిపిస్తుందన్న అంచనాలో ఉన్నారు కశ్యప్ రెడ్డి.

 • వైసీపీ నుంచి నందమల్లె నరేశ్ పోటీకి నిలుచుంటున్నారు.
  • మొదటి నుంచి అగ్రవర్ణాల చేతిలో ఉన్న హుజురాబాద్ లో  2009లో బీసీల చేతిలోకొచ్చింది.
  • ఈటెల రాజేందర్ కు ఇక్కడి బీసీలు పట్టం కట్టారు.
  • 64 శాతం మేర బీసీలే సెగ్మెంట్ లో గెలుపోటములను శాసిస్తున్నారు.
  • తెలంగాణ సాధనతో పాటు బలమైన కేడర్ ఉండడంవల్ల ఈసారి కూడా హుజురాబాద్ ఈటెల రాజేందర్ దే అనే అంచనా కూడా ఉంది.

  Comments are closed.

  © 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
  Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
  without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy