జువెనైల్ చట్టసవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

rajyasabha 11జువెనైల్ జస్టిస్ సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. రాజ్యసభలో ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత ఆమోదం లభించింది. మైనర్ బాలనేరస్తుల వయస్సును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించారు. బాలనేరస్తుల చట్ట సవరణ బిల్లును లోక్ సభ ఇదివరకే ఆమోదించింది. తాజాగా రాజ్యసభలో ఆమోదం లభించడంతో రాష్ట్రపతికి పంపనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశాక బిల్లు అమల్లోకి రానుంది.జువెనైల్ జస్టిస్ బిల్లుపై చర్చ సందర్భంగా నిర్భయ తల్లిదండ్రులు కూడా సభకు వచ్చారు. విజిటర్స్ గ్యాలరీలో ఉండి చర్చను విన్నారు. అయితే.. బిల్లు పాసవడం ఆనందగా ఉన్నా.. తన కూతురికి న్యాయం జరగకపోవడం బాధగా ఉందన్నారు నిర్భయ తల్లి ఆశాదేవి. . బాలనేరస్తుల వయస్సును 16 ఏళ్లకు తగ్గించడాన్ని సీపీఎం వ్యతిరేకించింది. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపకపోవడానికి నిరసనగా ఓటింగ్ జరుగుతున్న టైంలో సీపీఎం ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.

జువెనైల్ చట్ట సవరణ బిల్లు ఆమోదం తర్వాత ఇరత బిల్లుల ఆమోదానికి కాంగ్రెస్‌ సభ్యులు అడ్డుపడ్డారు. దీంతో కాంగ్రెస్‌పై అధికార పార్టీ సభ్యులు మండిపడ్డారు. సభలో గందరగోళం నెలకొనడంతో డిప్యూటీ ఛైర్మన్‌ రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు. మరోవైపు లోక్‌సభ బోనస్‌ చెల్లింపు చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. కార్మికులకు బెనిఫిట్‌ సీలింగ్‌ రూ.3,500 నుంచి 7,500, అర్హత సీలింగ్‌ రూ.10వేల నుంచి రూ.21వేలకు పెంచుతూ లోక్‌సభ బిల్లును ఆమోదించింది. ఈ చట్టం 2014 జులై నుంచి అమల్లోకి రానుంది. తర్వాత లోక్ సభ రేపటి వాయిదా పడింది.

 

 

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy