జూన్ వరకు ఎల్బీనగర్‌ కు మెట్రోరైల్ : కేటీఆర్

KTR METROవచ్చే రెండునెలల్లో ఎల్బీనగర్‌ కు మెట్రోరైల్‌ ను సీఎం కేసీఆర్ తో ప్రారంభిస్తామని కేటీఆర్ ప్రకటించారు. ఈ మార్గాన్ని నాగోల్‌ కు కలుపుతామని, ఎల్బీనగర్ నుంచి ఫలక్‌నుమా మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు పొడిగిస్తామని చెప్పారు. ఎల్బీనగర్ ఎడమవైపు అండర్‌ పాస్ డిసెంబర్‌కు పూర్తవుతుందన్నారు. మూసీ సుందరీకరణ పనులు జరుగుతున్నాయన్న కేటీఆర్.. మూసీపై ఎక్స్‌ ప్రెస్‌ వే నిర్మిస్తామని చెప్పారు. ఔటర్ రింగురోడ్డులో భాగంగా రూ.125 కోట్లతో నిర్మించిన 1.10 కి.మీల కండ్లకోయ జంక్షన్, అక్కడి టోల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, టోల్‌ప్లాజాలను మంగళవారం (మే-1) ప్రారంభించారు మంత్రి కేటీఆర్. రామంతాపూర్ నుంచి నారపల్లి వరకు రూ.960 కోట్లతో నిర్మించతలపెట్టిన స్కైవే నిర్మాణ పనుల రోడ్‌మ్యాప్‌ ను పరిశీలించారు.

ఔటర్ రింగురోడ్డు దేశానికే తలమానికమని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోని ఏ నగరానికి ఇంతపెద్ద ఎనిమిది లేన్ల రింగురోడ్డు లేదని చెప్పారు. ఔటర్‌ద్వారా ప్రయాణసౌకర్యాలు మెరుగుపడటంతోపాటు పారిశ్రామిక అభివృద్ధి, శాటిలైట్ టౌన్‌షిప్పుల అభివృద్ధి వంటి ప్రణాళికబద్ధమైన ప్రగతికి అవకాశం కలుగుతుందని తెలిపారు. ఔటర్‌పై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటూనే త్వరలో టోల్ అడ్మినిస్ట్రేటివ్ భవనాల వద్ద ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. వీటితోపాటు రూ.70కోట్లతో హైవే ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం ప్రాజెక్టు చేపడుతున్నామని, తద్వారా వాహనాల వేగ నియంత్రణ, ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని తెలిపారు.

ORRపై గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు 25 కిలోమీటర్ల దూరం LED లైట్లు అమర్చామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కొద్దిరోజుల్లోనే రూ.107 కోట్లతో ఔటర్ మొత్తంలో LED లైట్లను ఏర్పాటుచేయబోతున్నామని చెప్పారు. దీని ఫలితంగా.. ఆకాశం నుంచి చూస్తే మణిహారంలా ORR కనిపిస్తుందని తెలిపారు. ఔటర్ సంపూర్ణంతో హైదరాబాద్ విస్తరణకు అనుగుణంగా 35 రేడియల్ రోడ్ల నిర్మాణాన్ని HMDA చేపడుతున్నదని, అందులో 19 పూర్తికాగా, మరో ఐదు వివిధదశల్లో ఉన్నాయని చెప్పారు. 11 చోట్ల రేడియల్ రోడ్ల పనులను చేపట్టాల్సి ఉందన్నారు. వీటిని పూర్తిచేయడం ద్వారా ఔటర్‌ కు ప్రజలు వేగంగా చేరుకునే వీలుంటుందన్నారు మంత్రి కేటీఆర్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy