జూన్ 1న రాష్ట్రానికి రాహుల్

rahul-gandhiసంగారెడ్డిలో  జూన్ 1న.. తెలంగాణ  ప్రజాగర్జన పేరుతో సభ జరుపుతున్నట్టు ప్రకటించారు  పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సభకు  AICC ఉపాధ్యక్షులు  రాహుల్ గాంధీ వస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ లీడర్లు  పార్టీ మారుతున్నారన్న  ప్రచారాన్ని కొట్టిపడేశారు. జూన్ 1న సాయంత్రం 4.30 గంటలకు జరిగే సభకు ముందు అదే ప్రాంగణంలో రాహుల్‌గాంధీ రాష్ట్రంలోని కొన్ని బాధిత వర్గాలను కలిసి వారి ఆవేదనను పంచుకుంటారు. సభలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రసంగిస్తారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం రాహుల్‌ పర్యటన వివరాలను వెల్లడించారు. గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఉత్తమ్‌తోపాటు పార్టీ నేతలు దామోదర రాజనర్సింహ, బలరాంనాయక్‌, దాసోజు శ్రావణ్‌కుమార్‌, అద్దంకి దయాకర్‌, బెల్లయ్యనాయక్‌, సుధాకర్‌గౌడ్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు. రాహుల్‌ సభకు లక్షన్నర మందితో జన సమీకరణ చేస్తున్నట్లు ఉత్తమ్‌ ప్రకటించారు. ఈ సభలోనే రాహుల్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలోని కొన్ని అంశాలను ప్రకటిస్తారని తెలిపారు.

సంగారెడ్డి సభకు ప్రతి పల్లె నుంచి పది మంది చొప్పున తరలివచ్చేలా చూడాలని ఉత్తమ్‌ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. గాంధీభవన్‌లో గురువారం టీపీసీసీ కార్యవర్గ భేటీలో జరిగింది. రాహుల్‌ సభను భారీ ఎత్తున విజయవంతం చేయాలని ఉత్తమ్‌ సూచించారు. రాహుల్‌ ప్రత్యేక విమానంలో బేగంపేటకు వస్తారని, అక్కడి నుంచి సంగారెడ్డి వరకు భారీగా ర్యాలీ నిర్వహించాలని ఆయన చెప్పారు. నగర వ్యాప్తంగా జెండాలు, తోరణాలతో అలంకరణ చేయాలన్నారు. సభ ముందు భాగాన మిర్చి రైతులు, భూసేకరణ బాధితులు, నిరుద్యోగ యువత, మహిళలు ఉండేలా చూసుకోవాలన్నారు. రాహుల్‌ సభకు రాగానే ఆయా వర్గాలను కలిసి కొద్ది సేపు ముచ్చటిస్తారని చెప్పారు. సభకు లక్షన్నర నుంచి రెండు లక్షల మందిని తరలించాలని సూచించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy