జూన్ 1 నుంచి మోగనున్న సేవా పన్ను మోత..!

11F_service-tax14 శాతం సర్వీస్ ట్యాక్స్ వసూలుకు రెడీ

అలాగే… జూన్ ఫస్ట్ నుంచి రైలు ప్రయాణమూ భారమే

నరేంద్ర మోడీ సర్కార్ ప్రజలపై మరో భారం వేసేందుకు రెడీ అయింది. 2015 బడ్జెట్ లో ప్రతిపాదించినట్లుగా వచ్చే నెల ఒకటి నుంచి సర్వీస్ ట్యాక్స్ 14 శాతం వసూలు చేసేందుకు రెడీ అయింది. ప్రజెంట్ సేవా పన్ను విద్యా సెస్ ను కూడా కలుపుకుని 12.36 శాతంగా ఉంది. అదికాస్తా జూన్ ఫస్ట్ నుంచి 14 శాతానికి పెరగనుంది. సర్వీస్ టాక్స్.. పెంపుతో బలయ్యేది సామన్యులే.  కామన్ పీపుల్ పై దీని ఎఫెక్ట్ భారీగానే పడనుంది. ముఖ్యంగా మొబైల్ కాల్ చార్జీలు పెరగుతాయి. ఇన్సురెన్స్, క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్స్,  డీటీహెచ్, కొరియర్ సర్వీసులు, స్టాక్ బ్రోకింగ్ రిలేటెడ్.. సర్వీసెస్ లు భారం కానున్నాయి. హోటల్ రూమ్స్, కేటరింగ్ రెస్టారెంట్లు, బ్యూటీ పార్లర్ బిల్స్… ధరలు పెరిగే లిస్టులో ఉన్నాయి. అంటే హోటల్ కెళ్లి ఏమైనా తింటే అదనంగా రెండు శాతం బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. విమాన సర్వీసులు … క్యాబ్ సేవలు కూడా మరింత ప్రియం కానున్నాయి. స్పాట్:

మోడీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన.. 2015 బబ్జెట్ లో స్వచ్చ భారత్ కు మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చింది. స్వచ్చ భారత్ కు ఇచ్చే విరాళాలకు వందకు వంద శాతం పన్ను మినహాయింపునిచ్చింది. అలాగే స్వచ్చ భారత్ మిషన్ ప్రచారం నిర్వహణ నిధుల కోసం.. కొన్ని సెలెక్టెడ్ సర్వీసులపై 2 శాతం అదనపు సెస్ ను విధించాలని డిసైడైంది. అయితే ఈ సెస్ ఏ సర్వీసులపై వేస్తారు.. ఎప్పటి నుంచి అమల్లోకి రానుందనే విషయంలోమాత్రం ఇంకా క్లారిటీ లేదు. జూన్ ఫస్ట్ నుంచి రైల్వే ప్రయాణం కూడా భారం కాబోతోంది. ఏసీ , ఫస్ట్ క్లాస్ రైలు టికెట్ రేట్లు కొద్దిగా పెరగబోతున్నాయి. సర్వీస్ టాక్స్ 0.5శాతం హైక్ అవుతోంది. గూడ్స్ రవాణాకు కూడా కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. పెరిగిన సేవా పన్ను.. స్వచ్చభారత్ సెస్ తో..కలిపి ప్రజలపై అదనంగా.. 4 శాతం సర్వీస్ టాక్స్ భారం పడే అవకాశం ఉంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ఆదాయాలు భారీగా పెరగనున్నాయి. క్లీన్ ఇండియా సంగతి ఎలా ఉన్నా సేవాపన్నుపేరుతో మనీ షేవింగ్ చేస్తున్నారంటూ జనాలు భగ్గుమంటున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy