జూన్ 2 న ఉద్యోగాల ప్రకటన?

20150306050757!Telengana_State_Emblemజూన్ 2 న ప్రకటన వచ్చే అవకాశం

రాష్ట్ర పుట్టిన రోజు ఏర్పాట్లపై రేపు రాష్ట్ర కేబినేట్ కమిటీ భేటి

రాష్ట్ర పుట్టినరోజు వేడుకలకు ఏర్పాట్లు షురూ

రాష్ట్ర కేబినెట్ రేపు సమావేశం కాబోతోంది. సచివాలయంలో సాయంత్రం నాలుగింటికి మంత్రులందరితో కలిసి సీఎం కేసీఆర్ డిస్కస్ చేయబోతున్నారు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో చివరిసారిగా కేబినెట్ భేటీ అయింది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ముందు జరుగుతున్న మంత్రివర్గ సమావేశం కావడంతో.. సీఎం ఎలాంటి ప్రకటనలు చేస్తారు.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇంట్రస్టింగ్ గా మారింది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ తొలి వార్షికోత్సవాన్ని గతం గంటే ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే స్టేట్ సర్కారు డిసైడైంది. దీనికి సంబంధించి మరింతగా పక్కాగా మంత్రులతో సీఎం డిస్కస్ చేయబోతున్నారు. కొత్త ఇరిగేషన్ చట్టం… ఐటీ పాలసీలపైనా చర్చలు జరపబోతున్నారు. సంక్షేమ పథకాలపై అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఖర్చుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అమలులో ఉన్న అడ్డంకులను ఈ సమావేశంలో రివ్యూ చేయబోతోంది. వివాదస్పదమైన పార్లమెంటరీ కార్యదర్శుల నియామకంపై… సీఎం కేసీఆర్ మంత్రులతో సమీక్షించబోతున్నారు.

అన్నింటికంటే ముఖ్యంగా ఈసారి సమావేశంలో ఉద్యోగ నోటిఫికేషన్ల ఇష్యూపై ఫోకస్ చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. వన్నియర్ గడిచినా.. ఉద్యోగ ప్రకటనలు ఇంకా రాకపోయేసరికి నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారు. రీసెంట్ గా.. డబుల్ బెడ్ రూమ్ లు యూనివర్సిటీ భూముల్లో కట్టిస్తామని యూనివర్సిటీల్లో చదివే స్టూడెంట్లకు మరింత కోపం తెప్పించారు సీఎం. ఒక్క ప్రకటనతో అన్ని పరిస్థితులను సానుకూలంగా మార్చుకునేలా కేసీఆర్ ఆలోచిస్తున్నారని కొందరు భావిస్తున్నారు. తెలంగాణ వచ్చి ఏడాది గడిచినా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయలేదన్న చెడ్డపేరు తెచ్చుకోకుండా ఈసారి దీనిపైనే ఫోకస్ చేసే ఛాన్సుందంటున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మిషన్ కాకతీయ, డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ స్కీమ్, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం ఇలా చాలా అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. వాటర్ గ్రిడ్ పైలాన్ ఆవిష్కారం, యాదాద్రి పవర్ ప్లాంట్ భూమిపూజ, నక్కలగండి ప్రాజెక్టుకు శంకుస్థాపన వీటి షెడ్యూల్ కూడా ఫైనల్ చేసే ఛాన్సుంది. మరోవైపు. ఈనెల 30వ తేదీన యాదగిరిగుట్టలో పర్యటించబోతున్నారు సీఎం కేసీఆర్. యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులకు ఇదే రోజు సీఎం శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్,  త్రిదండి చినజీయర్ స్వామి కూడా అటెండ్ అవుతున్నారు. నిపుణుల సలహాలతో ఇప్పటికే రెడీ అయిన అభివృద్ధి ప్రణాళికలో ఒక్కో స్టెప్ వేయబోతున్నారు సీఎం కేసీఆర్.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy