జూబ్లీ బస్టాండ్‌ – లోతుకుంట : అద్భుత రీతిలో స్కైవే

51503517249_625x300హైదరాబాద్ నగరానికే స్పెషల్ ఎట్రాక్షన్ గా 158 కిలోమీటర్ల ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మించి, ప్రపంచం దృష్టిని ఆకర్షించిన HMDA.. అవకాశం వస్తే నూతన ఫ్లైఓవర్లు,  స్కైవే పనులను అంతకుమించి అద్భుత రీతిలో నిర్మించాలని యోచిస్తోంది. బాలానగర్‌లోని నర్సాపూర్‌ చౌరస్తాపై ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గించేందుకు శోభనా థియేటర్‌ నుంచి IDPL వరకు ఆరు లేన్ల ఫ్లైఓవర్‌ పనులకు ఇటీవల భూమిపూజ చేసింది. ఇప్పుడు జూబ్లీ బస్టాండ్‌ నుంచి లోతుకుంట వరకు 6 కి.మీ స్కైవే నిర్మాణ పనులు చేపట్టేందుకు HMDA ఆసక్తి చూపుతోంది. స్కైవే నిర్మాణం, భూ సేకరణకు రూ.1,400 కోట్లు అంచనా వ్యయం అవుతుండగా ఇప్పటికే HMDA వద్ద జైకా నుంచి తీసుకున్న రుణంలో రూ.600 కోట్లు ఉన్నాయి. మిగిలిన రూ.800 కోట్లు ప్రభుత్వం సమకూరిస్తే స్కైవే పనులు చేపట్టేందుకు HMDA సిద్ధమవుతోంది. ఈ స్కైవే నిర్మాణం వల్ల ORRకు అనుసంధానం కావడంతో పాటు కరీంనగర్‌ నుంచి వచ్చే ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పనున్నాయి. స్కైవే నిర్మాణం చేపట్టాలనుకుంటున్న ప్రాంతంలో రక్షణ శాఖ భూములు ఉండటంతో వాటిని ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం కోరింది. దీనికి రక్షణ శాఖ అంగీకారం తెలిపినా.. అధికారికంగా ఆదేశాలు రాలేదు. అవి రాగానే స్కైవే నిర్మాణ  పనులు చేపట్టనున్నారు. ప్యారడైజ్‌ నుంచి బోయిన్‌పల్లి వరకు ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న స్కైవేకు నిధులు మంజూరు చేస్తే ఆ పనులు కూడా HMDA చేపట్టేందుకు రెడీగా ఉందని ఓ అధికారి వెల్లడించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy