జూలైలోనే పరుగులు : అమీర్ పేట్-LB నగర్ మెట్రో టెస్ట్ రన్

TRAILహైదరాబాద్ లో మరో రూట్ లో మెట్రో పరుగులు పెట్టేందుకు సమయం ఆసన్నమవుతోంది. ఇప్పటికే నాగోల్-మియాపూర్ మెట్రో రూట్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. అమీర్‌పేట-LB నగర్ మెట్రోమార్గం అతి త్వరలో అందుబాటులోకి రానున్నది. 16 కిలోమీటర్ల ఈ మార్గంలో ఇప్పటికే స్టేషన్లు, ట్రాక్, సిగ్నలింగ్, ఎలక్ట్రిఫికేషన్ పూర్తికావడంతో టెస్ట్న్ నిర్వహిస్తున్నారు.

పది రోజుల్లో ఈ రూట్ లో ట్రయల్న్ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ట్రయల్న్ నిర్వహించిన తర్వాత CMRS  తనిఖీలు పూర్తవగానే ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. ఇందులో భాగంగా అమీర్‌పేట-LBనగర్ మార్గంలో శనివారం (జూన్-2) టెస్ట్ రన్ నిర్వహించారు. అమీర్‌పేట-హైటెక్‌ సిటీ మార్గంలో పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి. JBS-MGBS మార్గంలో సుల్తాన్‌ బజార్ మినహా మిగతా పనులన్నీ పూర్తయ్యాయి. MGBS వద్ద నిర్మిస్తున్న ఇంటర్‌ చేంజ్ పూర్తి కావచ్చంది. MGBS-JBS 10 కిలోమీటర్ల మార్గాన్ని ఈ ఏడాది చివరికి అందుబాటులోకి తేనున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy