జూలో వెచ్చగా : జంతువులకు హీటర్లు

zoo-winterనెహ్రూ జంతు ప్రదర్శనశాల భారత దేశంలోని అతిపెద్ద  జంతు ప్రదర్శనశాల. హైదరాబాద్ లోని జూలో ఇప్పుడు జంతువులు చలికి వణికిపోతున్నాయి. శీతాకాలంలో చలిని తట్టుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పులులు, చిరుతపులులు, చింపాంజీ, సింహాలు, కోతుల కోసం రాత్రిపూట హీటర్లను ఏర్పాటు చేశారు అధికారులు. రాత్రిపూట చలిని తట్టుకోవడానికి చిన్న, చిన్న జంతువుల కోసం చెక్క పెట్టేలను తయారు చేయించారు. పక్షులను పెట్టే గూడుల్లో చలి రాకుండా ఆకుపచ్చ క్లాత్ తో పూర్తిగా కవర్ చేశారు. కొన్ని రకాల జంతువుల నివాసాలకు చలి రాకుండా గన్నీ బ్యాగ్ లను కవర్ చేస్తున్నారు.

వివిధ రకాల జంతువులు, సరీసృపాలు, పక్షులు జూలో ఉన్నాయి. టైగర్, పాంథర్, ఏషియాటిక్ లయన్, ఏనుగులు, పైథాన్, కొండచిలువ, ఒరాంగుటాన్, మొసలి, పక్షులు ఏంటేలోప్స్, జింకలు, ఇండియన్ రైనో రకరకాల కోతుల వంటి సహజమైన జంతువుల జాతులని ఈ జూలో ఉన్నాయి. 380 ఎకరాల విస్తీర్ణంలో 1,500 జాతుల జంతువులు, పక్షులు ఉన్నాయి. చలి నుంచి జంతువులు, పక్షులను కాపాడేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ఈ ప్రాణులన్ని సురక్షితంగా ఉండడానికి ఏ సీజన్ లో ఏలాంటి జాగ్రతలు తీసుకోవాలో అలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. చలి ఎక్కువగా ఉండటంతో రాత్రి పూట జంతువులు ఇబ్బంది పడుతున్నాయి.. వాటికి వెచ్చగా ఉండేందుకు హీటర్లు పెట్టినట్లు తెలిపారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy