జెండా చిరిగిన ఇష్యూ : ఇండియాకు బ్రిటన్ క్షమాపణ

ukindianflagప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బ్రిటన్ పర్యటనను వ్యతిరేకిస్తూ సాగిన ఆందోళనల్లో త్రివర్ణ పతాకం చినిగిపోయిన ఘటనపై బ్రిటన్ ప్రభుత్వం క్షమాపణ చెప్పింది. మోడీ పర్యటనను నిరసిస్తూ పార్లమెంట్ స్కేర్‌ లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ క్రమంలో త్రివర్ణ పతాకం చినిగిపోయింది. దీంతో అక్కడి భారత అధికారులు ఈ ఘటనపై విదేశాంగ కార్యాలయంతో పాటు స్కాట్లాండ్ యార్డ్‌కు ఫిర్యాదు చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంది. అయితే పార్లమెంట్ స్కేర్‌ లో జరిగిన ఘటన మమ్మల్ని అసంతృప్తికి గురిచేసింది. దీని గురించి తెలిసిన వెంటనే హై కమిషనర్ యష్‌వర్ధన్ కుమార్ సిన్హాతో మాట్లాడాం. మోడీ టూర్ కారణంగా ఇండియాతో యూకే బంధం మరింత బలోపేతమైంది అని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

పార్లమెంట్ స్కేర్‌ లో మోడీకి వ్యతిరేకంగా 500 మంది ఆందోళనకారులు నిరసన తెలిపారు. ఇందులో యూకే సిఖ్ ఫెడరేషన్‌ కు చెందిన ఖలిస్థాన్ మద్దతుదారులు, పాకిస్థాన్ సంతతి వ్యక్తి నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలోని మోడీని వ్యతిరేకించే మైనార్టీలు కూడా వీళ్లలో ఉన్నారు. అయితే ఈ ఆందోళనలను ఖండిస్తూ పార్లమెంట్‌ లో ప్రకటన చేయాల్సిందిగా కన్జర్వేటిప్ పార్టీ ఎంపీ బాబ్ బ్లాక్‌ మాన్.. ప్రధాని థెరెసా మేను కోరినా ఆమె స్పందించలేదు. ఈ ఘటనను ఖండించకపోయినా.. ఇండియా తమకు మంచి మిత్రదేశమని, యూకే అభివృద్ధిలో భారతీయులు తమ వంతు పాత్ర పోషించారని మే కొనియాడారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy