‘జేఈఈ’లో రాష్ట్ర విద్యార్థులు సత్తా : టాప్ 15 లో నలుగురు మనోళ్లే

 దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐటీల్లో ఇంజనీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2019 ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 100 పర్సెంటైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించిన15 మంది లో మనోళ్లే నలుగురు ఉన్నారు. ఈ నెల 9 నుంచి 12 వరకు దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరగ్గా 8,74,469 మంది పరీక్షలు రాశారు. నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఏ) శనివారం ఫలితాలను విడుదల చేసింది. టాప్‌ 15లో తెలంగాణ నుంచి నలుగురు, ఏపీ నుంచి ఒకరు ఉండగా, మహారాష్ట్ర నుంచి ముగ్గురు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచి ఇద్దరు, మధ్యప్రదేశ్, కర్ణాటక, పంజాబ్ నుంచి ఒక్కొక్కరు 100 పర్సెంటైల్ సాధించారు. తెలంగాణ టాపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సిద్దిపేట జిల్లా పాములపల్లి గ్రామానికి(ప్రస్తుతం గజ్వేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్థిరపడ్డారు) చెందిన ఆదెల్లి సాయికిరణ్ నిలిచారు. రాష్ట్రానికే చెందిన ఇందుకూరి జయంత్ ఫణిసాయి, కె.విశ్వనాథ్, బట్టేపాటి కార్తికేయ కూడా 100 పర్సెంటైల్ సాధించారు. తెలంగాణ నుంచి సుమారు 70 వేల మంది హాజరయ్యారు.

టాపర్‌ ధ్రువ్‌ అరోరా
జేఈఈ మెయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ధ్రువ్‌ ఆరోరా నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన బొజ్జ చేతన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, మహారాష్ట్రకు చెందిన రాజ్‌ ఆర్యన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అగర్వా ల్, అంకిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిశ్రా, కార్తికేయ చంద్రేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గుప్తా, రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన
సంబిత్ బెహరా, శుభంకర్ గంభీర్, ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన నమన్ గుప్తా, హిమాన్షు గౌరవ్ సింగ్, కర్ణాటకకు చెందిన కెవిన్ మార్టిన్, పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన జయేశ్ సింగ్లా 100 పర్సెంటైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించిన వారిలో ఉన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy