జేఈఈ మెయిన్ నోటిఫికేషన్ విడుదల

JEEఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ, ఇతర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే జాతీయస్థాయి విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌–2018 పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ను మంగళవారం విడుదల చేసింది సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ). 2018 ఏప్రిల్ 8న ఆఫ్ లైన్ లో రాత పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. డిసెంబర్‌ 1 నుంచి 2018 జనవరి 1వరకు ఆన్ లైన్ లో (jeemain.nic.in)  దరఖాస్తు చేసుకోవచ్చునని, జనవరి 2వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది సీబీఎస్‌ఈ.  ఈ పరీక్షకు ముందుగానే విద్యార్థులు ఆధార్‌ను సమకూర్చుకోవాలని స్పష్టం చేసింది.

జేఈఈ మెయిన్‌ ద్వారానే ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ, జీఎఫ్‌టీఐలలో ప్రవేశాలు చేపట్టాలని నిర్ణయించింది. అలాగే ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను నిర్వహించేందుకు ఐఐటీల కౌన్సిల్‌ నిర్ణయించి కాన్పూర్‌ ఐఐటీకి ఆ బాధ్యత అప్పగించింది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన టాప్‌ 2.21 లక్షల మందిని 2017లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హులుగా పరిగణనలోకి తీసుకోగా 2018 విద్యా సంవత్సరంలో 2.24 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హులుగా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది.

వివరాలన్ని వెబ్ సైట్ లోనే..

జేఈఈ మెయిన్ పరీక్షకు సంబందించిన ఇన్ ఫర్మేషన్ బులిటెన్, పరీక్ష వివరాలు, సిలబస్, అర్హతలు, పరీక్ష ఫీజు, పరీక్ష నిర్వహించే కేంద్రాల వివరాలను జేఈఈ మెయిన్ వెబ్ సైట్ లో పొందవచ్చని సీబీఎస్‌ఈ పేర్కొంది. అలాగే విద్యార్థుల అర్హతలు, వయోపరిమితి సడలింపులు, రిజర్వేషన్ల వివరాలు కూడా వెబ్ సైట్ లో పొందవచ్చును. ఐఐటీల్లో ప్రవేశాల కోసం గతంలో జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్షను ఆఫ్ లైన్ తోపాటు ఆన్ లైన్ లోనూ నిర్వహించగా ఈసారి జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్షను ఆన్ లైన్ లోనే నిర్వహిస్తామని పరీక్ష నిర్వహణ సంస్థ ఐఐటీ కాన్పూర్ స్పష్టం చేసింది.2018 మే 21న ఆన్ లైన్ పరీక్ష నిర్వహణకు నోటిఫికేషన్ ను కూడా జారీ చేసింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy