జేఈఈ మెయిన్ రిజల్ట్స్.. నలుగురు తెలంగాణ స్టూడెంట్స్ కు 100 పర్సెంటైల్

దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్ఐటీల్లో ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నేషనల్ టెస్ట్ ఏజెన్సీ (NTA) నిర్వహించిన జేఈఈ మెయిన్-2019 రిజల్ట్స్ వచ్చాయి. జనవరి 8 నుంచి 12 వరకు జరిగిన పరీక్ష ఫలితాలు రికార్డ్ స్పీడ్ లో వారంలోనే వచ్చేశాయి. దేశ వ్యాప్తంగా 8.75 లక్షల మంది ఈ పరీక్ష రాశారు. వీరిలో 15 మందికి 100 పర్సెంటైల్ వచ్చింది. అందులో నలుగురు తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. మహారాష్ట్ర నుంచి మగ్గురు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచి ఇద్దరు చొప్పున, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు చొప్పున 100 పర్సెంటైల్ సాధించారు.

ఆ 15 మంది వీరే..

  • ఆదెల్లి సాయి కిరణ్ (తెలంగాణ)
  • ఇందుకూరి జయంత్ ఫణి సాయి (తెలంగాణ)
  • కె.విశ్వనాథ్ (తెలంగాణ)
  • బట్టేపాటి కార్తికేయ (తెలంగాణ)
  • బొజ్జ చేతన్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్)
  • రాజ్ ఆర్యన్ అగర్వాల్ (మహారాష్ట్ర)
  • అంకిత్ కుమార్ మిశ్రా (మహారాష్ట్ర)
  • కార్తికేయ్ చంద్రేశ్ గుప్తా (మహారాష్ట్ర)
  • సంబిత్ బెహరా (రాజస్థాన్)
  • శుభంకర్ గంభీర్ (రాజస్థాన్)
  • నమన్ గుప్తా (ఉత్తరప్రదేశ్)
  • హిమాన్షు గౌరవ్ సింగ్ (ఉత్తరప్రదేశ్)
  • జయేశ్ సింగ్లా (పంజాబ్)
  • కెవిన్ మార్టిన్ (కర్ణాటక)
  • ధ్రువ్ అరోరా (మధ్యప్రదేశ్)

జేఈఈ మెయిన్-2 ఏప్రిల్ లో నిర్వహిస్తామని, ఈ పరీక్షకు ఫిబ్రవరి 8 నుంచి మార్చి 7 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని, ఈ ఫలితాలు కూడా వచ్చాక ర్యాంకులు ఇస్తామని కేంద్ర మంత్రి జవదేకర్ ప్రకటించారు.

ఫలితాల కోసం ఈ వెబ్ సైట్ లో చూడండి: jeemain.nic.in

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy