జేబులో బాంబులు : పవర్ బ్యాంక్ లు పేలుతున్నాయ్.. జాగ్రత్త

powerbankస్మార్ట్ ఫోన్ల వినియోగం ఎక్కువ కావడం.. చార్జింగ్ సమస్యలు వస్తున్నాయి. ఫుల్ చార్జింగ్ ఉన్నా.. యూజ్ ఎక్కువ కావడంతో త్వరగా చార్జింగ్ అయిపోతుంది. జర్నీలో ఈ సమస్య ఎక్కువ. దీంతో స్మార్ట్ ఫోన్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్లు.. ఇంట్లో ఫుల్ గా ఛార్జీంగ్ చేసినా పవర్ బ్యాంక్ ను ఉపయోగిస్తున్నారు.

ఎక్కడికెళ్లినా చేతిలో మొబైల్, బ్యాగ్‌లో పవర్ బ్యాంక్ ఉండాల్సిందే. ఇందులో భాగంగానే  ఓ వ్యక్తి పవర్ బ్యాంకును బ్యాగ్‌లో వేసుకుని బస్సు ఎక్కాడు. అంతే క్షణాల్లో బ్యాగ్‌లోని పవర్ బ్యాంకు బాంబు పేలినట్లు పేలింది. ఆ వ్యక్తికి, బ్యాగుకు మంటలు అంటుకున్నాయి. వెంటనే ఆ బ్యాగును కింద పడేయడంతో అతడు ప్రాణాల నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన చైనాలోని గాంగ్జు సిటీలో జరిగింది. బస్సులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. మొన్ననే ముంబైలోని ఓ రెస్టారెంట్ లో జేబులోని పవర్ బ్యాంక్ పేలిన విషయం తెలిసిందే..

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy