జైట్లీ రాజీనామా చేయాల్సిందే

arvindkejriwalడీడీసీఏ ఇష్యూ తో ఢిల్లీ సర్కార్, కేంద్ర సర్కార్ మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. స్పెషల్ అసెంబ్లీ  సెషన్ లో ప్రధాని నరేంద్రమోడీపై ఫుల్ ఫైరయ్యారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. కేంద్ర ప్రభుత్వ పథకాల క్రెడిట్ అంతా ప్రధానికే ఇస్తున్నా… తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. జైట్లీ వేసిన పరువునష్టం దావాపై ఇవాళ ఆప్ తరుపు న్యాయవాది ఫూల్కా కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు కోర్టు మూడు వారాల టైం ఇచ్చిందని చెప్పారు . జైట్లీకి రెండు వారాల టైం ఇచ్చిందన్నారు. దీనిపై మళ్లీ ఫిబ్రవరి ఐదున ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. మరోవైపు జైట్లీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సీపీఎం జాతీయ ప్రధానకార్యదర్శి సీతారం ఏచూరీ. గతంలో  అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు అద్వానీ రిజైన్ చేసిన విషయాన్ని గుర్తు  చేశారు.  అయితే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆరోపణలను పట్టించుకోవడం లేదు. జైట్లీ క్లీన్ గా బయటకు వస్తారని అభిప్రాయపడ్డారు ప్రధాని నరేంద్రమోడీ. ఇవాళ ఉదయం జరిగిన పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో ఈ ఇష్యూపై డిస్కస్ చేశారు. పార్లమెంట్ లోనూ డీడీసీఏ రగడ కంటిన్యూ అయ్యింది. అవినీతి ఆరోపణలు వచ్చిన జైట్లీ రాజీనామా చేయాలని డిమాండ్ తో పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి.  పోడియం దగ్గరకు దూసుకెళ్లిన ఎంపీలు.. జైట్లీ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు జైట్లీకి మద్ధతుగా ఢిల్లీ అంసెబ్లీ ముందు బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. జైట్లీపై కేజ్రీవాల్ అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy