జైపూర్ థర్మల్ వెలుగుల వెనుక ఎంతో కృషి

thermalఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి తో పాటు కరీంనగర్ జిల్లా రామగుండంలో సింగరేణి  బొగ్గు గనులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో వచ్చే బొగ్గును థర్మల్ పవర్ ప్లాంట్ లకు సింగరేణి సంస్థ సప్లయ్ చేస్తోంది. పవర్ ప్లాంట్స్ కి బొగ్గు పంపే బదులు… సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేయాలని 2005-06 మధ్య కాలంలో సింగరేణి భావించింది. అప్పుడు సింగరేణి సీఎండీగా ఉన్న నర్సింగరావు ఆద్వర్యంలో  అధికారులు మొదట 600 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటుకు అనుమతులు తీసుకున్నారు. దాన్ని 1200 కు పెంచాలని సింగరేణి భావించింది. ఇందుకోసం అప్పటి పెద్దపల్లి ఎంపీ వెంకటస్వామి, రాష్ట్ర కార్మికశాఖ మంత్రిగా, చెన్నూరు ఎమ్మెల్యేగా  ఉన్న ఆయన కుమారుడు వినోద్ కలిసి… 2008 లో ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసి మరో 600 మెగావాట్ల యూనిట్ల ఏర్పాటుకు అనుమతి తీసుకున్నారు. కేంద్ర సబ్ కమిటీ భేటీలో 6500 కోట్లతో 1200 మెగావాట్ల యూనిట్ల విద్యుదుత్పత్తికి ఆమోదం తెలిపారు. కానీ పర్యావరణ అనుమతులు రాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు.

2009 లో పెద్దపల్లి నుంచి ఎంపీగా ఎన్నికైన కాకా కుమారుడు డా.జి వివేకానంద…  జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రయత్నాలు కొనసాగించారు. తెలంగాణ లో పవర్ ప్లాంట్ ఏర్పాటైతే సీమాంద్ర పవర్ ప్లాంట్స్ కు సింగరేణి బొగ్గు రాదన్న ఆలోచనతోనే నాటి సీమాంద్ర పాలకులు పర్యావరణ అనుమతులను అడ్డుకున్నారని ప్రచారం జరిగింది. దాంతో వివేక్ కేంద్ర మంత్రులతో చాలాసార్లు మాట్లాడి… పర్యావరణ అనుమతులు ఇప్పించారు.

పవర్ ప్లాంట్ కు 2009లో శంకుస్థాపన జరగ్గా… 2010 ఫిబ్రవరి లో పనులు ప్రారంభయ్యాయి. తర్వాత 6 వేల 500 కోట్ల నిధులు సరిపోకపోవడంతో అంచనా వ్యయాన్ని పెంచడానికి ఎంపీగా వివేక్ కృషి చేశారు.

6 వందల మెగావాట్ల సామర్థ్యంతో రెండు యూనిట్లను సింగరేణి సంస్థ… ఆదిలాబాద్ జిల్లా జైపూర్ దగ్గర నిర్మించింది. మొత్తం 1200 మెగావాట్ల విద్యుత్ సింక్రనైజేషన్ కూడా విజయవంతమైంది. రెండు యూనిట్ల ద్వారా మెదక్ జిల్లా గజ్వేల్ విద్యుత్ గ్రిడ్ కు అనుసంధానం చేశారు. రైతులతో పాటు పారిశ్రామికవేత్తలకు కూడా జైపూర్ విద్యుత్ ఎంతో ఉపయోగపడనుంది. ఈనెల 7న ప్రధాని నరేంద్రమోడి, సీఎం కేసిఆర్ చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధమైంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy