జైలుకెళ్లిన శశికళకు శుభవార్తే ..

sasikala91ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుకెళ్లిన శశికళకు ముమ్మాటికి  ఇది శుభవార్తే. తమిళనాడు ముఖ్యమంత్రిగా పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేయడంతో ఆమె పంతం నెగ్గినట్లయ్యింది. సీఎం పదవి చేపట్టేందుకు తనకు అక్రమాస్తుల కేసు అడ్డు వస్తున్నందున పళనిస్వామి పేరును శశికళ తెరపైకి తెచ్చారు. పార్టీకి ద్రోహం చేసిన పన్నీరుసెల్వం ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ముఖ్యమంత్రి కాకూడదని.. తన మనిషే సీఎం కావాలని శశికళ పట్టుబట్టారు. ఎమ్మెల్యేలు జారిపోకుండా చర్యలు తీసుకున్నారు.

పళనిస్వామిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునే అంశంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దీంతో ఎమ్మెల్యేలు తనవైపునకు వస్తారని భావించిన పన్నీరు సెల్వంకు నిరాశ ఎదురైంది. బల నిరూపణకు అవకాశం వస్తే ఎమ్మెల్యేలు తనకే మద్దతిస్తారని పన్నీర్‌ సెల్వం చెప్పినప్పటికీ ఎంతమంది కలిసి వస్తారన్నది ఆయనకే క్లారిటీ లేకపోవడంతో ఆచితూచి వ్యవహరించారు గవర్నర్‌ విద్యాసాగర్ రావు. చివరికి మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతున్న పళనిస్వామికే సీఎం పదవి కట్టబెట్టారు గవర్నర్. దీంతో శశికళ జైలు వెళ్ళిన తాను రచించిన వ్యూహం సఫలీకృతం కావడంతో ఆమె వర్గంలో ఆనందం వెళ్ళివిరిసింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy