జై జవాన్: జోరు వర్షంలో నిండు గర్భిణీని కాపాడిన జవాన్లు

kashmir-mosఅర్ధరాత్రి.. జోరు వర్షం.. నడిరోడ్డుపై అంబులెన్స్. దానిలో ఓ నిండు గర్భిణి. తీవ్ర నొప్పులతో ఇబ్బంది పడుతోంది. ఎంతకూ అంబులెన్స్ కదలడం లేదు. చుట్టూ నిర్మానుష్యంగా ఉంది. దరిదాపుల్లో ఎవరూ కనపడటం లేదు. దీంతో ఆమె భర్త అబ్దుల్ అహద్ ఖాన్ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాడు. ఇద్దరిపై ఆశలు వదిలేసుకున్నాడు. ఇంతలో డ్రైవర్ సమయస్ఫూర్తితో అంబులెన్స్ సైరన్ చాలా సేపు మోగించాడు. ఎక్కడి నుంచి వచ్చారో.. చటుక్కున ప్రత్యక్షమయ్యారు సైనికులు. అంబులెన్స్‌లో నిండు చూలాలు పడుతున్న బాధను చూసి వారు చలించిపోయారు. వెంటనే తలో చెయ్యి వేసి… సుమారు అరకిలోమీటర్ తోశారు. అప్పుడు స్టార్ట్ అయ్యింది అంబులెన్స్. అయితే భారీ వర్షాలతో ఆ రోడ్డు మూసుకుపోయింది.  డ్రైవర్‌కు మరో దారి సూచించారు జవాన్లు. దీంతో అతడు నిండు గర్భిణిని సకాలంలో శ్రీనగర్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్ళగలిగాడు. అక్కడ ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

అబ్దుల్ అహద్ ఖాన్… ముఖంలో అప్పుడు చిరునవ్వులు కనిపించాయి. అప్పటి వరకు ఆశలు వదిలేసుకున్న ఆయన.. భార్యాబిడ్డలు తనకు దక్కడంతో జై జవాన్ అంటూ.. ఆ ఏరియా ఆర్మీ కమాండర్‌కు ఫోన్ చేశారు. సైనికులు సకాలంలో చేసిన సహాయం తన భార్యాబిడ్డల ప్రాణాలు కాపాడిందంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ జవాన్లకు తాము రుణపడి ఉంటామని, వారికి మంచి జరగాలని ప్రార్థిస్తామని ఆయన అన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy