జై శ్రీరాం అన్న ముస్లిం అధికారి

UPప్రజల్లో సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన సభలో ఓ ముస్లిం ఉన్నతాధికారి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. తానొక్కడే కాదు సభలో పాల్గొన్నవారితోనూ జై శ్రీరామ్ అనిపించారు. ఈ ఆసక్తికరమైన సన్నివేశం ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది. మొరాదాబాద్‌ పంచాయితీ భవన్‌లో సమాచార హక్కు చట్టంపై అవగాహన కోసం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ హఫీజ్ ఉస్మాన్ పై విధంగా స్పందించారు. ఆయన తన చేతులు పైకెత్తి ‘జై శ్రీరామ్’ అంటూ ఆపై ప్రజలతోనూ అనిపించారు.

అంతే కాదు ప్రజలకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ కల్పించిన ప్రపంచంలోని ఏకైక దేశం ఇండియానే అని అన్నారు. ట్రిపుల్ తలాక్ కాదు కదా.. ఒక్క తలాక్ చెప్పినా నేరమేనని హఫీజ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆయన భారత్ మాతాకీ జై అని కూడా నినాదం చేశారు. అలాగే సౌదీ అరేబియా విధించిన సెన్సార్ షిప్‌పై కూడా విమర్శలు గుప్పించారు. మతపరమైన అంశాలను మాట్లాడవద్దంటూ ఈ కార్యక్రమానికి సమన్వకర్తగా వ్యవహరించిన వ్యక్తి… ఉస్మాన్‌ను కోరడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమన్వకర్త వ్యాఖ్యలతో మరింత రెచ్చిపోయిన ఉస్మాన్ పదేపదే జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై అన్నారు. అధికారిక కార్యక్రమంలో మతపరమైన అంశాలను లేవనెత్తి… ఓ మతానికి అనుకూలంగా నినాదాలు చేయడంపై ముస్లిం మత పెద్దలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశంలో ఆయనతోపాటు డీఎం, డీఐజీ లాంటి ఉన్నతాధికారులు కూడా పొల్గొన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy