జొహన్నెస్‌బర్గ్‌ టెస్ట్ : భారత్ బ్యాటింగ్

india-south-africaజొహన్నెస్‌బర్గ్‌ లోని వాండరర్స్‌ మైదానంలో బుధవారం (జనవరి-24) సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన టీమిండియా ఈ టెస్ట్ గెలిచి, కనీసం పరువుకాపాడుకోవాలని చూస్తోంది. మరోవైపు గెలుపుతో మంచి జోరుమీదున్న సఫారీలు భారత్ ను వైట్ వాష్ చేయాలని గట్టిగానే ప్రాక్టీస్ చేసింది. లాస్ట్ టెస్టు జట్టు విష‌యంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న కెప్టెన్ కోహ్లీ.. ఈ మ్యాచ్‌కు కూడా రెండు కీలక మార్పులు చేశాడు. రోహిత్‌శర్మ స్థానంలో అజింక్య రహానే, అశ్విన్ స్థానంలో భువనేశ్వర్ కుమార్ టీమ్‌లోకి వచ్చారు. ఈ లెక్కన పాండ్యాతో కలిపి ఐదుగురు పేస్‌బౌలర్లతో ఈ మ్యాచ్ బరిలోకి దిగుతుండటం విశేషం. అటు సౌతాఫ్రికా కూడా స్పిన్న‌ర్ లేకుండా బ‌రిలోకి దిగుతున్న‌ది. కేశ‌వ్ మ‌హ‌రాజ్‌ను ప‌క్క‌న‌పెట్టి పెహ్లుక్‌వాయోను టీమ్‌లోకి తీసుకుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy