జోన్లలో జిల్లాలు ఇలా : ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్స్

jones-fbరాష్ట్రంలో కొత్తగా ఏడు జోన్లు.. రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. గురువారం (మే-24) ప్రగతి భవన్ లో ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారు సీఎం కేసీఆర్. స్థానికులకు ఎక్కువ ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు కేసీఆర్.

 

జోన్లు – జిల్లాల వివరాలు ఇలా :

…కాళేశ్వరం జోన్- భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి (28.29 లక్షల జనాభా)

…బాసర జోన్- ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల (39.74 లక్షల జనాభా)

…రాజన్న జోన్ –కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ (43.09 లక్షల జనాభా)

…యాదాద్రి జోన్-సూర్యపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ (45.23లక్షల జనాభా)

…భద్రాద్రి జోన్-కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్(50.44 లక్షల జనాభా)

…జోగులాంబ జోన్-మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, వికారాబాద్ (44.63 లక్షల జనాభా)

…చార్మినార్ జోన్-  హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి (1.03 కోట్ల జనాభా)

మల్టీజోన్లు

మల్టీజోన్లు-1-యాదాద్రి, చార్మినార్, జోగులాంబ (1.88 కోట్ల జనాభా)

మల్టీజోన్లు-2-కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి  (1.61 కోట్ల జనాభా)

రాష్ట్రంలోని 31 జిల్లాలను వివిధ జోన్లు, మల్టీ జోన్లుగా విభజించిన అంశాన్ని ఉద్యోగులకు తెలియచేయడంతో పాటు ఇతర అంశాలు చర్చించడానికి శుక్రవారం టీజీవో భవన్ లో సమావేశం జరుగనుంది. ఉద్యోగుల సమావేశం తర్వాత వారి అభిప్రాయాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిస్తారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వానికి నోట్ పంపుతారు. దీనిపై కేబినెట్ సమావేశం జరుగుతుంది. జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థకు కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే కేంద్రానికి పంపుతారు. అక్కడి నుంచి రాష్ట్రపతి ఆమోదం కోసం వెళుతుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షించి, తెలంగాణలో కొత్త జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చేలా చూస్తానని చెప్పారు సీఎం కేసీఆర్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy